వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశాలకు వేదికైన దావోస్‌ నగరం పూర్తిగా భారత్‌మయమైపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పేరు మారు మోగుతుంది... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'దావోస్' వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు చంద్రబాబు. దావోస్ లో ' బ్రాండ్ ఏపీ ' కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా పనులు చేస్తోంది.... అక్కడ ఏపి లాంజ్ అందరినీ ఆకట్టుకుంటుంది... ముఖ్యంగా, అక్కడ ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ వీడియో వాల్, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది... దీని గురించి తెలుసుకోవటానికి, అక్కడకు చాలా మంది వచ్చి చూస్తున్నారు...

ap davos 24012018 2

అలాగే, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అనేక విషయాలు తెలుపుతూ, గోడలు నిండా, సమాచారం పెట్టారు... ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న వనరులు ఏంటి ? ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి లాంటి వివరాలు తెలుపుతూ, అక్కడ గోడల నిండా సమాచారం నింపారు... సన్ రైజ్ ఏపీ అనే పేరు పెట్టి ఒక లాంజ్ తో పాటు సన్ రైజ్ ఏపీ హోర్డింగ్ లు కూడా చాలానే హడావిడి చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ బస్సుని సన్‌ రైజ్‌ ఏపీ డిజైన్లతో నింపేసింది. అక్కడి రోడ్లపై సన్‌రైజ్‌ ఏపీ బస్సు చక్కర్ల కొడ్తోంది కూడా...

ap davos 24012018 3

ఆంధ్రప్రదేశ్‌ తో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తమ అధికారుల కోసం అక్కడ ప్రత్యేకంగా లాంజ్‌ఏర్పాటు చేసింది. ఏపి లాంజ్‌లో మరో ప్రత్యేకత ఆంధ్రా వంటకాలు... ఆంధ్రా వంటకాలనూ అందుబాటులోకి తెచ్చారు. సోమవారం ప్రారంభమై డబ్ల్యుఈఫ్‌ 48వ వార్షిక సమవేశాలు శుక్రవారం ముగియనున్నాయి. ఈసారి భారత్‌ నుంచి 130 మంది సిఇఒలు, 2000కు పైగా వ్యాపార అధినేతలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 70 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు... ఏపి లాంజ్ ఎలా ఉందో, ఈ వీడియో లో చూడండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read