రైతు శ్రమను అవమానించేలా మాట్లాడిన శ్రీరంగనాథరాజును తక్షణమే మంత్రి పదవి నుండి తొలగించాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.  వరిసాగు సోమరిపోతు వ్యవసాయం అంటూ మంత్రి శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరంగనాథరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో  ఆదివారం చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి జగన్, వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. లిక్కర్ అమ్ముకుని బతికే వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా రైతులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తిండిగింజలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతులను సోమరి రైతులుగా మాట్లాడిన మంత్రి రాజీనామా చేయాలని అన్నారు. పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు కనీస మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొంతు శివసాంబిరెడ్డి, తిరువీధుల బాపనయ్య, కుమార స్వామి,  ఇంటూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read