ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. జనవరి 6న ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఆకస్మికంగా నిర్ణయించిన కార్యక్రమాలతో ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో ప్రధాని పర్యటన ఉండే అవకాశం ఉంది. తొలుత నిర్ణయించిన ప్రకారం ప్రధాని జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించాలన్నది ప్రణాళిక. కేరళ భాజపా వర్గాలు నిర్ణయించిన ప్రకారం తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మోదీ మధ్యాహ్నం నుంచి ఏపీ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. అందుకు అనుగుణంగా గుంటూరు నగరంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగాయి. అయితే ఆకస్మికంగా నిర్ణయించిన కార్యక్రమాలతో మోదీ పర్యటన వాయిదా పడింది.
అయితే జనవరి లేదా ఫిబ్రవరిలో మోడీ ఏపికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఫిబ్రవరిలో మొదటి తారీఖు నుంచే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అవే చివరి సమావేశాలు. అవి 10 రోజుల దాకా ఉండే అవకాసం ఉంది. ఇవి అయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. ఇక ఈ హడావిడిలో పడిపొతే, ఏపి వైపు చూసే అవకాశమే లేదు. ఎందుకంటే ఏపిలో బీజేపీ ఒక్క ఎంపీ స్థానంలో కూడా డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. తనకు బలం ఉన్న చోట, హోరా హూరీ ఉన్న చోటే ప్రచారానికే వెళ్తారు. అందుకనే ఇక ఏపిలో మోడీ పర్యటన ఉండే అవకాశాలు లేవని చెప్తున్నారు. మోడీ బదులు, ఒకటి రెండు సార్లు, అమిత్ షా పర్యటన చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ ఏపికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
ఏ హామీ నెరవేర్చకుండా, ఏపి వస్తే, ఏమి చెయ్యలేమని అర్ధమయ్యే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా, జనవరి 6న కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ ప్రకటన ఉంటుందనే లీక్లు ఇచ్చారు. ప్రధాని స్వయంగా ఈ ప్రకటన చేస్తారని బీజేపీ నాయకులు అన్నారు. అయితే, ఇవి ప్రకటన చెయ్యాలంటే, ఇంకా అధ్యయనం చెయ్యాలని కేంద్రం చెప్పటంతో, ఈ ప్రకటన లేదని, కేవలం చంద్రబాబు పై విమర్శలకు అయితే, మీటింగ్ అనవసరం అని బీజేపీ నాయకులు నిర్ణయం తీసుకుని ఉండచ్చు. వారం నుంచి తెగ హడావిడి చేసిన బీజేపీ నాయకులు, ఈ పరిణామంతో షాక్ అయ్యారు. మోడీ నెలాఖరుకి వస్తారని, ఈ లోపు ఏపికి ఇచ్చిన అన్ని హామీలు నేరవేరుస్తారని, పాత పాటే పాడారు.