ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. ప్రసుత్తం ఉన్న కన్నా లక్ష్మీనారాయాణను అధిష్టానం తొలగించి, ఆయన స్థానంలో సోము వీర్రాజుని నియమించింది. కన్నా లక్ష్మీనారాయాణ పదవీ కాలం రెండేళ్ళు పూర్తీ అవ్వటంతో, ఆయన స్థానంలో కొత్త వ్యక్తి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా, ఇప్పటికి కొత్త నియామకం జరిగింది. సహజంగా బీజేపీలో రెండు ఏళ్ళు బీజేపీ అధ్యక్షులుగా ఉంటారు. మిగతా రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు వచ్చినా, ఏపి రాష్ట్రానికి పెండింగ్ లో పడింది. నాలుగు నెలలు లేటుగా నియామకం జరిగింది. అయితే కన్నా లక్ష్మీ నారాయణ స్థానంలో, సోము వీర్రాజుని నియమించారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. గతంలో తెలుగుదేశం హయంలో ఉండగా, అప్పట్లో బీజేపీ మిత్ర పక్షంగా ఉండటంతో, చంద్రబాబుని అడిగి, ఎమ్మెల్సీగా సోముని నియమించుకుంది బీజేపీ. మరో పక్క ఆర్ఎస్ఎస్ కూడా, సోము వైపు మొగ్గు చూపటంతో, నియామకానికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది.
సంఘ్ నేపధ్యం ఉండటం, సంఘ్ సిఫార్సుతోనే, ఆయనకు అధ్యక్ష పదవి వరించింది అనే ప్రచారం జరుగుతుంది. ఎవరు అవును అన్నా కాదన్నా, బీజేపీ రెండు వర్గాలుగా ఉంది. ఒక వర్గం వైసీపీకి బాగా అనుకూలంగా ఉంటే, ఒక వర్గం బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సోము వీర్రాజు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా పని చేస్తూ ఉండేవారు. గత ఏడాది కాలంలో కూడా, వైసీపీ ప్రభుత్వానికి కంటే, తెలుగుదేశం మీదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. మొత్తానికి తమకు పక్కలో బల్లెంలా ఉంటూ, 108 స్కాం, కరోనా కిట్ల స్కాం బయట పెట్టిన కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్ష పదవి నుంచి వెళ్ళిపోవటంతో, ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా సంబర పడి పోతుంది. మరి కొత్తగా వచ్చిన సోము వీర్రాజు గారి అజెండా ఏమిటో, రానున్న రోజుల్లో తెలిసిపోతుంది.