ఇండియాలో, ఏపినే నెంబర్ వన్ అంటే కొంత మంది రాష్ట్రంలో ఉన్న వారికి తెగ బాధ వచ్చేస్తుంది. చంద్రబాబుకి మంచి పేరు వచ్చేస్తుంది కదా, అందుకే ఆ రకమైన ఏడుపు అనమాట. ఈ వార్తా చూడగానే, ఎల్లో మీడియా అలాగే రాస్తుందిలే అంటారు. కాని, ఇండియాలోనే ఏపి నెంబర్ వన్ అని చెప్పింది, ఒకటి కాదు, రెండు కాడి అయిదు సంస్థలు. ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల సంస్థ (యూఎన్‌డీపీ), ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీయూ), పీపుల్‌ స్ర్టాంగ్‌, సీఐఐ, వీ-బాక్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తెలిపాయి.

one 21112018 2

ఇండియా స్కిల్స్‌ నివేదిక-2019 నివేదికలో, ఇవన్నీ రాసారు. ఈ వివరాలను గురువారం (22న) లఖ్‌నవ్‌లో జరిగే ‘గ్లోబల్‌ స్కిల్స్‌ సమ్మిట్‌’లో అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ సర్వే ప్రకారం ఉద్యోగాల కల్పనలో ఏపీ టాప్‌లో ఉంటే పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. నైపుణ్యాభివృద్ధిలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఇక నగరాల విషయానికొస్తే చురుకైన విద్యార్థులు కలిగిన వారిలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే.. చెన్నయ్‌, గుంటూరు, లఖ్‌నవ్‌, ముంబై, ఢిల్లీ, నాసిక్‌, పుణె విద్యార్థులు వరసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖ విద్యార్థులు ఇంగ్లి్‌షలోనూ, విశ్లేషణాత్మక ఆలోచనల్లోనూ, లాజికల్‌ సమస్యలను పరిష్కరించడంలోనూ, నడవడికలోనూ ముందంజలో ఉన్నట్లు వెల్లడైంది.

one 21112018 3

ఏపీ యువతకు ఉద్యోగ కల్పన కోసం పలు అంతర్జాతీయ, జాతీయ ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏటా 3 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అందిస్తోన్న ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ చక్కటి ఫలితాన్ని అందిస్తోందని సర్వేలో వెల్లడైంది. ఎంబీఏ కంటే ఇంజనీరింగ్‌ విద్యార్థులే రాష్ట్రంలో ఎక్కువగా, త్వరగా ఉద్యోగాలు పొందగలుగుతున్నారని తేలింది. వాస్తవానికి యూఎన్‌డీపీ, ఏఐసీటీయూ, సీఐఐ, ఏఐయూ, పీపుల్స్‌ స్ట్రాంగ్‌, వీ-బాక్స్‌ సంస్థలు గతేడాది నిర్వహించిన సర్వేలో ఏపీ టాప్‌-10లో నిలిచింది. ఈ ఏడాది మాత్రం ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం దక్కించుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read