పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన మోడీ ప్రభుత్వం, అది పూర్తి చెయ్యటానికి మాత్రం అనేక అడ్డంకులు పెడుతుంది. చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష కోసం, రాష్ట్ర ప్రజల జీవనాడికి ఇబ్బందులు కలిగిస్తుంది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలతో సహా డిజైన్ల ఆమోదం, రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కేంద్రం కావాలని ఆలస్యం చేస్తుంది. 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం నిధులు విడుదల చేసినా.. ప్రధాని మోదీకి గానీ, బీజేపీకిగానీ ఎలాంటి క్రెడిట్‌ దక్కదనే నిశ్చితాభిప్రాయానికి కేంద్రంలోని పెద్దలు వచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే... పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధులను రీయింబర్స్‌మెంట్‌ చేయడంలో సవాలక్ష అడ్డంకులను సృష్టిస్తోందని జల వనరుల శాఖ ఉన్నతాధికారవర్గాలు వివరిస్తున్నాయి.

polavaram 02062018 2

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ.1089 కోట్లను రీయింబర్స్‌ చేస్తున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ఆర్థికశాఖ లిఖిత పూర్వకంగా వెల్లడించింది. రెండుసార్లు అధికారికంగా సమాచారం పంపినందున ఒకటి రెండురోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ నుంచి రూ.1089 కోట్ల నిధులు పీపీఏకు చేరుతాయని రాష్ట్ర జల వనరులశాఖ ఆశించింది. కానీ, అంతలోనే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, నాబార్డుల మధ్య కుదిరిన మొమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌(ఏంవోఏ)లో కొద్దిపాటి సవరణలు చేసుకోవాల్సి ఉందంటూ నాబార్డు పేర్కొంది. ఈ ఫైళ్లకు మోక్షం కలిగితే తప్ప.. మార్చి నెలలో విడుదల కావాల్సిన రీయింబర్స్‌మెంట్‌ మొత్తం విడుదల కాదు. ఇప్పటకీ ఆ నిధులు వదల్లేదు...

polavaram 02062018 3

దీంతో మన అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ప్రాజెక్టులపై సమీక్ష పేరిట కేంద్ర జలవనరుల శాఖ ఈనెల 11న ఏర్పాటు చేసిన భేటీకి హాజరు కాకూడదని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర అధికారి ముఖాన సూటిగా చెప్పేసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగే సమీక్షకు హాజరు కావాలని కోరుతూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారికి ఫోన్‌ చేశారు. దీనిపై రాష్ట్ర అధికారి తీవ్రంగా స్పందించారు. ‘‘పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని కేంద్రం మాటలు చెబుతోంది. ఏపీ నుంచి పంపిన ప్రతి ఫైలునూ వెనువెంటనే క్లియర్‌ చేసేస్తున్నామని పేర్కొంటోంది. కానీ, ఆచరణలో అది కనిపించడం లేదు. గత 6 నెలలుగా పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్క పైసా విడుదల కాలేదు. "

"2017-18 సంవత్సరానికి రావాల్సిన రూ.1089కోట్ల రీయింబర్స్‌ చేయలేదు. ఆ తర్వాత విడుదలైన రూ.1400కోట్లు, రీయింబర్స్‌మెంట్‌ కింద రావాల్సిన మరో రూ.350 కోట్లు కూడా రాలేదు. వీటిని విడుదల చేసినట్లు కాగితాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కొత్త ఒప్పందాలంటూ నాటకాలు ఆడుతున్నారు. పోలవరం తుది అంచనాలు ఇంత ఎక్కువైతే ఎలా అని సీడబ్ల్యూసీ ప్రశ్నిస్తోంది. సాంకేతిక అంశాలను పరిశీలించాల్సిన సీడబ్ల్యూసీకి.. భూ సేకరణ చట్టం, సహాయ పునరావాస కార్యక్రమాల గురించి ఏం పని?’’ అని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారి ఒకరు కేంద్ర అధికారిని సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 11న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాబోమని తేల్చిచెప్పారు. ‘ఈ సమావేశానికి మేమెందుకు రావాలి? మీరు చెప్పే హరికథలను వినడానికి రావాలా? మీ మాటలు విని సంబరపడాలా’ అని ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read