రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కత్తిమహేశ్ వ్యాఖ్యలు చేశారని డీజీపీ తెలిపారు. సీటీ పోలీస్ యాక్ట్, నేరగాళ్ల నియంత్రణ చట్టం ప్రకారమే కత్తిపై నగర బహిష్కరణ వేటు వేశామని చెప్పారు. మహేష్‌ను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లలో వదిలేస్తామని తెలిపారు. బహిష్కరణను అతిక్రమించి నగరంలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తే మూడేళ్లపాటు శిక్షపడే నేరమవుతుందని అన్నారు. అందుకే ఆరు నెలల పాటు, తను హైదరాబాద్ రాకూడదు అని, ఆంధ్రప్రదేశ్ లో దింపేస్తున్నామని అన్నారు.
అయితే, ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా చాలా కఠినంగా ఉన్నారు. తెలంగాణాలో తప్పు చేసిన వ్యక్తిని, హైదరాబాద్ నుంచి బహిష్కరించారు బాగానే ఉంది కాని, అతన్ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావటం ఏంటి అని అంటున్నారు. తప్పు ఎక్కడ చేసినా తప్పే అని, అలాంటిది అక్కడ శిక్షించకుండా, ఆంధ్రప్రదేశ్ మీద వదిలేయటం ఏంటి అని అంటున్నారు. కత్తి మహేష్ ను మరెక్కడైనా దింపుకోండి అని, తెలంగాణా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. తప్పు చేసాడు అని చెప్తూ, అతన్ని మా మీదకు వదలటం ఏంటి అని, మీరు అతన్ని ఆంధ్రప్రదేశ్ లో విడిచి పెడితే, మేము తీసుకొచ్చి మళ్ళీ అతన్ని హైదరాబాద్ లోనే విడిచిపెడతాం అని ఆంధ్రా పోలీసులు, తెలంగాణా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది.
కత్తి మహేశ్ భావవ్యక్తీకరణ పేరుతో టీవీ ఛానళ్లను వేదికగా చేసుకుని మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా కొన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి. భావ వ్యక్తీకరణ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. దానివల్ల సమాజంలోని ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలి. అయితే హైదరాబాద్ పోలీసులు అక్కడ శిక్షలు వెయ్యకుండా, అతన్ని ఆంధ్రాలో తీసుకొచ్చి పడేయటం వెనుక, రాజకీయ కుట్ర లేకపోలేదని పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. అతని మీద చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ మీద ఒత్తిడి తేవటం, చర్యలు తీసుకుంటే ఒకలా, తీసుకోకుంటే ఒకలా, ఆందోళన చెయ్యటానికి కుట్ర పన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆంధ్రా పోలీసులు ఈ తలనొప్పి మాకెందుకని, మీరు ఎక్కడైనా అతన్ని తీసుకెళ్ళండి కాని, ఆంధ్రప్రదేశ్ లో దింపితే మాత్రం, అతన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో దింపేస్తాం అని చెప్పినట్టు సమాచారం..