ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల అంశం, అనేక మలుపులు తిరుగుతుంది. నిన్నటి వరకు ఈ కొత్తా పీఆర్సి ప్రకారం, పోలీసుల జీతాల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. పోలీసులు కూడా అదే భావించారు. అయితే ఈ రోజు పోలీసులు తమ పే స్లిప్లు చూసుకుని,లబోదిబో అంటున్నారు. మిగతా ఉద్యోగులు లాగా, పోలీసులకు ఆందోళన చేసే అవకాసం ఉండదు. పోలీసులకు ఉద్యోగ నియమ నిబంధనలు వేరుగా ఉంటాయి. పోలీసులు ఎక్కడా ఆందోళన కార్యక్రమాలు చేయటానికి ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఎప్పుడూ పోలీసులను టచ్ చేయవు. అయితే పొలీసులు కూడా అదే భావించారు. తమ జోలికి ప్రభుత్వం రాదులే అని అనుకున్నారు. అయితే అలా భావించిన పోలీసులకు షాక్ తగిలింది. తాజాగా వారి పే స్లిప్ లు చూసుకుంటే, హెచ్ఆర్ఏ లో కానీ, డీఏలో కానీ, కోత పడినట్టు పోలీసులు గ్రహించారు. ప్రధానంగా హెచ్ఆర్ఏ లో ఉద్యోగులకు తగ్గించినట్టే, 20 శాతం నుంచి 8 శాతానికి తగ్గించటంతో షాక్ అయ్యారు. అలాగే డీఏని కూడా తగ్గించారు. అయితే పోలీసులు నిన్నటి వరకు తమకు ఇది వర్తించవని, తమ జీతాలకు ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. అయితే నిన్న జీతాలు పడటం, పే స్లిప్లు చూసుకోవటంతో, అసలు విషయం బయట పడింది.

police 20202200 2

దీంతో పోలీసులు లోపల లోపల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ పైన సానుకూలంగా ఉందని భావించిన పోలీసులు, ఈ విషయం తెలుసుకుని , కోత పడిన జీతం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాము ఆందోళన చేయాలని అనుకున్నా కూడా, తమ డ్యూటీ పరంగా ఆందోళన చేయాలేని పరిస్థితిలో ఉన్నామని పోలీసులు వాపోతున్నారు. దీంతో ఇప్పుడు పోలీసులు కూడా, ఉద్యోగుల పై సానుభూతి చూపిస్తున్నారు. ఉద్యోగులు ఆందోళన చేయటంలో తప్పు లేదని అఫ్ ది రికార్డు గా మాట్లాడుకుంటున్నారు. రేపు ఉద్యోగుల చలో విజయవాడ విషయం పైన, పోలీసుల పైన ఒత్తిడి బాగా ఉంది. చలో విజయవాడ కార్యక్రమాన్ని అణిచివేయటానికి, ప్రభుత్వం, పోలీసులనే వాడుతుంది. దీంతో ఒక పక్క తమ పరిస్థితి కూడా దారుణంగా ఉందని తెలిసినా, ఉద్యోగుల డిమాండ్ కూడా న్యాయమైనది అని తెలిసినా, పోలీసులు తమ విధి నిర్వహణ చేయాల్సిన పరిస్థితి. మొత్తంగా, ప్రభుత్వం ఎవరినీ వదలకుండా, అందరి సరదా తీర్చేస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read