దేశంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన శాఖలు, సంస్థలు, వ్యక్తులకు ప్రతిష్ఠాత్మక సంస్థ స్కోచ్‌ అందించే అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటింది. స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డుల్లో 22 పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ పాలన, పాదర్శకత అమలు సహా పలు పథకాలతో రాష్ట్ర పురపాలక సంఘాలు అవార్డులు దక్కించుకున్నాయి. పాఠశాల విద్య, ఘనవ్యర్థాల నిర్వహణ, ఈ-కార్యాలయం, గృహనిర్మానం, మౌలిక సదుపాయాల కల్పన తదితర పలు విభాగాల్లో తాడిపత్రి పురపాలక సంఘానికి 10 పురస్కారాలు దక్కాయి. వీటిని మున్సిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణ అందుకున్నారు. ఉద్యోగులు సహా అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో కర్నూలులో ప్రతి ఆదివారం నిర్వహించే ‘హ్యాపీ సండే’ కార్యక్రమానికి , మున్సిపాలిటీ పరిధిలో అంగన్‌వాడీల ఆధునికీకరణకు దక్కిన అవార్డులు కమిషనర్‌ హరినాథ్‌రెడ్డి అందుకున్నారు. రెండంకెల వృద్ధిరేటుకు సంబంధించి ఏపీ ప్రణాళిక విభాగానికి అవార్డు లభించింది. విజయవాడ పరిధిలో చెత్త సేకరణ, సీసీ కెమెరాల నిర్వహణకు సంబంధించి నగరపాలికకకు అవార్డులు దక్కాయి.

ap 24062018 2

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) వరుసగా రెండో ఏడాది ‘స్కోచ్‌’ పురస్కారానికి ఎంపికైంది. ‘పారిశ్రామిక కేటాయింపులపై మూడో పక్షంతో పర్యవేక్షణ’ అంశంలో అవార్డు దక్కింది. ఏడుగురు యువ గ్రామీణ పారిశ్రామిక వేత్తలు పురస్కారాలు అందుకున్నారు. మంత్రి నారా లోకేశ్‌కు లభించిన ‘స్కోచ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గవర్నెన్స్‌’ అవార్డును రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరక్టర్‌ రంజిత్‌ బాషా అందుకున్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పీఆర్‌, ఆర్డీ శాఖకు దక్కిన మరో మూడు అవార్డులనూ ఆయన స్వీకరించారు. గ్రామీణ తాగునీటి సరఫరాలో అధునాతన ట్రాకింగ్‌, జలవాణి కాల్‌సెంటర్‌, డ్యాష్‌బోర్డుకు అవార్డులు దక్కాయి. ఇక స్కోచ్‌ ప్లాటినం అవార్డును ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ దక్కించుకుంది. మీసేవకు స్కోచ్‌ గోల్డ్‌ అవార్డు, స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ గోల్డ్‌ దక్కింది.

ap 24062018 3

రాష్ట్రంలో సూక్ష్మ సేద్యాన్ని విస్తరింపజేసి, ఉద్యాన పంటల సాగులో ప్రగతి సాధించిన ఏపీ మైక్రో ఇరిగేషన్‌ పీఓ సూర్యప్రకాశ్‌, గ్రామస్థాయిలో పశువుల ఇన్‌పుట్‌ దాణా పంపిణీ చేసిన పశు సంవర్థకశాఖ డైరెక్టర్‌ సోమశేఖరం స్కోచ్‌ అవార్డులను అందుకున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖకు మొత్తం 19 స్కోచ్‌ అవార్డులు వచ్చాయి. భూగర్భ జలాలను రియల్‌ టైమ్‌లో పర్యవేక్షిస్తూ వాటి పెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నందుకు గాను జాతీయ స్థాయిలో ప్లాటినం పీకాక్‌ అవార్డు లభించింది. అదేవిధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో పాటు నీరు-చెట్టుకు ‘ప్లాటినమ్‌ పీకాక్‌’ దక్కింది. రాష్ట్ర జల వనరుల సమాచారం, పురుషోత్తపట్నం, గండికోట ఎత్తిపోతల, ముచ్చుమర్రి, ఏపీఎ్‌సఐఈసీ ఎత్తిపోతలను పునరుద్ధరించినందుకు బంగా రు నెమలి అవార్డులొచ్చాయి. వెబ్‌ ఆధారిత జలవనరుల సమాచార వ్యవస్థకు ‘కాంస్య నెమలి’ పురస్కారం దక్కింది. అలాగే బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీకి రెండు పురస్కారాలు దక్కగా, ‘మన అమరావతి’ యాప్‌నకు ఇంకో అవార్డు దక్కింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read