విభజన చట్టం, హామీలకు అనుగుణంగా రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కేంద్రం పంపిన సమాధానంపై రాష్ట్రప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తీర్మానంలో ప్రత్యేక హోదా ప్రధానాంశం కాగా.. కేంద్రం పంపిన స్టేటస్‌ నోట్‌లో కనీసం దాని ప్రస్తావన కూడా లేకపోవడాన్ని గట్టిగా ఆక్షేపిస్తోంది. దీనిపై కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి సమాచారం సేకరించి విభజన వ్యవహారాల కార్యదర్శి ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి సదరు లేఖను రూపొందిస్తున్నారు.

reply 26112018 2

అమరావతి నిర్మాణమంటే అనవసరవు ఖర్చు.. రెవెన్యూ లోటు అడిగితే తప్పుడు గణాంకాలంటూ తప్పించుకుంటున్న కేంద్రం.. పోలవరం ప్రాజెక్టు విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తూ.. కొర్రీల రూపంలో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్న వైనాన్ని లేఖ ద్వారా కళ్లకు కట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి మోదీ ఏ విధంగా అడ్డుపడుతున్నదీ తేటతెల్లం చేయడానికి ఈ లేఖను మరో అస్త్రంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సదరు లేఖలో కింది అంశాలను ప్రస్తావించే అవకాశాలున్నాయి. స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తే ప్రత్యేక హోదా/ప్యాకేజీ ప్రయోజనాలు కల్పిస్తామని.. ఇందుకు రాష్ట్రం సహకరించడం లేదని గతంలో ఆరోపించిన కేంద్రం.. తన నోట్‌లో ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు?

reply 26112018 3

వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్న అంశంపైనా ఎందుకు సమాధానమివ్వలేదు? విభజన తర్వాత నవ్యాంధ్రకు ఏర్పడిన రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటులో ఇంకా రూ.12 వేల కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ మొత్తాన్ని ఇస్తామని, ఇచ్చేది లేదని గానీ స్టేటస్‌ నోట్‌లో స్పష్టత ఇవ్వలేదు. రెవెన్యూ లోటు కోసం రూ.3979 కోట్లే ఇచ్చామని చెప్పింది. మిగిలిన మొత్తంపై మీ నిర్ణయమేంటి? రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై లేనిపోని కొర్రీలు వేస్తూ తుది అంచనాలను ఆమోదించకుండా కాలహరణం చేస్తున్నారు. రాష్ట్ర తాగునీరు, సాగునీరు సమస్యను తీర్చే పోలవరం నిర్మాణానికి కేంద్రం అనుకూలమో కాదో కేంద్రం తేల్చాలి. రాష్ట్రానికి జాతీయ విద్యాసంస్థలు మంజూరు చేశారు సరే.. వాటి నిర్మాణానికి నిధులు ఎందుకివ్వడం లేదు? అందుకు కారణాలేంటో స్పష్టంగా చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read