కొన్నేళ్ళుగా ప్రైవేటు స్కూల్స్ పై ఆకర్షితులై తల్లిదండ్రులు విధ్యార్ధులను అక్కడ చేర్పించటంతో ప్రభుత్వ స్కూల్స్ విధ్యార్ధులు సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో చాలా స్కూల్స్ ముత పడ్డాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న చర్యల వల్ల మొత్తం మారిపోయింది. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ స్కూల్స్ లో సదుపాయాలు మెరుగు పరచటం, ఆడ పిల్లలకు సైకిల్స్, బయో మెట్రిక్ ద్వారా ప్రతి రోజు టీచర్స్ స్కూల్ కు వచ్చేలా చెయ్యటం, ఇలా అన్ని చర్యల వల్ల, గత సంవత్సరం నుంచి, నెమ్మదిగా మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ వైపు చూడటం మొదలు పెట్టారు. అంతే కాదు చదువులో వెనుకబడిన పిల్లలకు స్పెషల్ క్లాసులు కూడా పెడుతున్నారు. పదవి తరగతిలో మంచి మార్కులు వచ్చిన పిల్లలను, ప్రోత్సహిస్తున్నారు.

schools 07072018

ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్ లు తీసుకుంటే కలిగే లాభాల పై ప్రచారం చేసారు. దీంతో మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ కు మంచి రోజులు వచ్చాయి. మూత పడతాయి అనుకున్న స్కూల్స్ అన్నీ, పిల్లలతో కళకళలాడుతున్నాయి. బడి ఈడు పిల్లలను గుర్తించి, బడిలో చేర్పించే ఉద్దేశంతో మొదలు పెట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పటికే డిజిటల్ తరగతులతో ఒక విప్లవం సృష్టించిన ప్రభుత్వం, ఆ ఫలితాలతో, పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా కూడా చేస్తుంది.. దీంతో సామాన్య ప్రజలకు కూడా ప్రైవేటు స్కూల్స్ కాకుండా, మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ వైపు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ప్రైవేటు స్కూల్స్ దీటుగా, మేము కూడా చదువు చెప్తున్నాం అంటూ, ప్రభుత్వ స్కూల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి.

schools 07072018

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్స్ లో, 2016-17లో కృష్ణా జిల్లాలో 3.25 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 3.49 లక్షల మంది ఉన్నారు. 2017-18లో కృష్ణా జిల్లాలో 3 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 3.56 లక్షల మంది ఉన్నారు. 2018-19లో కృష్ణా జిల్లాలో 3.50 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 3.78 లక్షల మంది ఉన్నారు. అలాగే ప్రైవేటు స్కూల్స్ చూసుకుంటే, 2017-18లో కృష్ణా జిల్లాలో 2.3 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 2.83 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కలు చూస్తుంటే, ప్రజలు ప్రభుత్వ స్కూల్స్ వైపు చుస్తున్నారనే విషయం అర్ధమవుతుంది. వచ్చే ఏడాదికి, మరింత ఎక్కువ మంది వచ్చేలా ప్రణాలికలు రచిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read