తెలంగాణాలో, హరిత హారం అంటే ఎగబడ్డారు, ఆంధ్రప్రదేశ్ లో వనం-మనం అంటే మొఖం చాటేశారు...ఎవరి గురించి అనుకుంటున్నారా ? మన ఘనతవహించిన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ లు గురించి....అది హైదరాబాద్ మీద మోజో, లేక కెసిఆర్ అంటే భయమో, హరిత హారం అని తెలంగాణా ప్రభుత్వం పిలుపు ఇవ్వగానే, ఒక్కొక్కడు ఎగబడి, మొక్కలు నాటుతూ ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో షేర్ చేసి, లెక్చర్లు ఇచ్చారు.... సరే, మంచి పనికి సహకిరించారు, దాంట్లో తప్పేమీ ఉందిలే అనుకున్నాం...కాని అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వనం-మనం అంటే, ఒక్కడు కాకపొతే, ఒక్కడు కుడా కన్నెత్తి ఇటు చూడలా...

cbn 13022018 2

ఇలాంటి వారికి మొఖం పగిలిపోయే వార్త.. చేసే పని పట్ల చిత్తసుద్ధి ఉండాలి అనేది అందుకే.. ‘స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌-2017’ పేరిట కేంద్ర అటవీ, పర్యావరణశాఖ పరిధిలోని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఎఫ్ఎస్ ఐ) రూపొందించిన నివేదికలో, పచ్చదనం పెంపొందించడం లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది... తెలంగాణ ఐదో స్థానం సాధించింది... 2015-17 మధ్య కాలంలో ఏపీలో 2,141 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది... 1,101 చదరపు కిలోమీటర్లతో కర్ణాటక, 1,043 చ.కి.మీ.తో కేరళ, 885చ.కిమీ.తో ఒడిశా, 565 చ.కి.మీ.తో తెలంగాణ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి....

cbn 13022018 3

అందుకే చేసే పని పై చిత్తసుద్ధి ఉండాలి అనే అనేది... ఒక ప్రణాలిక చంద్రబాబుకి ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనం ఇంత పెరిగింది... తెలంగాణాలో పోల్చటానికి కారణం, అక్కడ హైదరాబాద్ బ్యాచ్ ఆంధ్రా పై అవలంభిస్తున్న విధానం వలన.. అమరావతి కట్టుకుంటే, చెట్లు నరికేశారు అని మీడియా స్టొరీలు వేస్తుంది... హరిత హారం, వనం-మనం పోల్చుతూ, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని హేళన చేస్తూ కధనాలు వేస్తాయి... చివరకు ఏమైంది ? అక్కడ ఫోటోలు దిగి, కెసిఆర్ ద్రుష్టిలో పడటానికి సినిమా బ్యాచ్ ఎగబడితే, ఇక్కడ మా రాష్ట్రం కోసం, వాడవాడలా, పెద్ద, చిన్నా అందరం కలిసి, వనం-మనం కార్యక్రమాన్ని దేశ చరిత్రలో నిలాపాం... ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసి, ఇంతటితో దులుపుకుని వెళ్ళిపోలా....ఆ మొక్కకి, మేమే రోజు నీళ్ళు పోసాం, దగ్గరుండి పెంచాం, పెద్దది చేసాం, మా రాష్ట్రాని హరితాంధ్రప్రదేశ్ చేసుకుంటున్నాం... దాని ఫలితాలే ఇవాళ, పచ్చదనం పెంపొందించడం లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read