ఒకే వేదిక పై చంద్రబాబు, బొత్స, హరీష్ రావు, రఘువీరా... ఏంటి ఈ కాంబినేషన్ అనుకుంటున్నారా ? వేరే పార్టీ నేతలు... వేరే రాష్ట్రం నేతలు.. నిత్యం కత్తులు దూసుకునే నేతలు... అందరూ ఒకే వేదిక పైన కనిపించనున్నారు... దీనికి వేదిక విజయవాడ "ఏ కన్వేషన్ " కానుంది... నవంబరు 10, సాయంత్రం 6.30 గంటలకు, ఎపి 24/7 ఛానల్‌ అధికారికంగా ప్రారంభం కానుంది... ఆంధ్ర ప్రదేశ్‌ తొలి న్యూస్ శాటిలైట్‌ ఛానల్‌ గా, ఎపి 24/7 ఛానల్ రానుంది...

ap 24 7 09112017 2

అన్నపూర్థా బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట మొదలవుతున్న ఎపి 24/7 ఛానల్‌ యజమాని వ్యాపారవేత్త నరసింహరాజు గారు... కాగా ఆపరేషన్స్ హెడ్ తో సహా, లీడ్ చేసేది మాత్రం ప్రముఖ జర్నలిస్ట్ వెంకటకృష్ణ... మరో సీనియర్ జర్నలిస్ట్ సాయి కూడా, ప్రముఖ పాత్ర పోషించనున్నారు... ఈ ఛానల్ అధికారికంగా, రేపు ప్రారంభం కానుంది.. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రానున్నారు...స్పీకర్‌ కోడెలతో పాటు తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు, వైసీపీనేత బొత్స, పిసిసిఅద్యక్షుడు రఘువీరాలను ఆత్మీయ అతిధులుగా రానున్నారు... వీరంతా ఒకే వేదిక మీద ఉండే అవకాసం ఉండటంతో, అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు...

ap 24 7 09112017 3

అడుగుజాడల,జైహింద్‌, స్టార్‌ షో, కలర్స్‌, ప్రజా క్షేత్రం, నమస్తే ఎన్‌ఆర్‌ఐ, కీచురాళ్లు, అదీ మ్యాటర్‌ వంటి వినూత్నమైన కార్యక్రమాలు రానున్నాయి. రెండు రాష్ట్రాల రాజధానుల లోగోలతో క్యాపిటల్‌ టైమ్స్‌ రూపంలో ఒక ప్రత్యేక కార్యక్రమం రానుంది. ఇప్పటికే ఈ ఛానెల్ టెస్ట్‌ సిగల్‌ ప్రారంభమయింది... మరో పక్క, ఇప్పటికే మహాటీవీ, త్వరలోనే అమరావతి నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టనున్నట్టు ప్రకటించింది... వీరితో పాటు, మరిన్ని న్యూస్ చానల్స్ హైదరాబాద్ నుంచి కాకుండా, మన అమరావతి నుంచే ప్రారంభం అవ్వాలి అని, మన రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి అని కోరుకుందాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read