కేంద్రం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు గురించి పట్టించుకోకుండా, కాలయాపన చేస్తున్న సంగతి తెలిసిందే... కేంద్రం వైఖరి పై, రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాజకీయంగా మిత్రపక్షంగా ఉంటూ కూడా ఆందోళన చేస్తుంది... విభజన చట్టంలో ఉన్న అన్ని సమస్యల పై, కేంద్రం పేచీ పెడుతున్నా, ముఖ్యంగా, ఆర్ధిక లోటు భర్తీ పై, ఇరు పక్షాలకు సయోధ్య కుదరటం లేదు... పార్లమెంట్ లో ఎంపీల ఆందోళన తరువాత, కేంద్రంలో కదిలక వచ్చి, ఈ అంశం పై దృష్టి సారించింది... రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులని ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడింది... అయినా, పాత పాటే పాడుతుంది కేంద్రం...
అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించిన తర్వాతా ఏ ఫలితమూ లేకపోవటంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది.... మరో సారి ఈ విషయం పై అధికారులు చర్చలు జరిపి, ఏ పరిష్కారం దొరక్కపోతే, రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికీ వెనుకాడకూడదని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.... రాష్ట్ర ప్రయోజనాల కోసం, తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యమైతే సుప్రీంకూ వెళ్లక తప్పదని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చారు...
రాష్ట్ర విభజన సమయంలో రెవెన్యూ లోటు 16,078.76 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత కొంత కేంద్రం విడుదల చేసింది. తాజాగా రాష్ట్ర అధికారులు కేంద్రంతో మాట్లాడిన తర్వాత రూ.7070 కోట్ల రుణ మాఫీ సొమ్ము మినహాయించుకున్న తర్వాత కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిసి లెక్కించగా... రెవెన్యూ లోటు రూ.7,509 కోట్లుగా తేలింది. రూ.3520.50 కోట్లు ఇంకా రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని అంగీకరించినా ఆ మొత్తం ఇచ్చేందుకు కేంద్ర అధికారులు ససేమిరా అంటున్నారని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ లోటు ఇక కేవలం రూ.138.38 కోట్లే ఇస్తామంటున్నారని వారంటున్నారు.