మాది ధనిక రాష్ట్రం, మాకు ఆంధ్రప్రదేశ్ తో పోలిక ఏంటి అంటూ డాంబికాలు పోయిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, మన ఆంధ్రప్రదేశ్ కరెంటు వాడుకుని, మనకి బాకీ ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు... మానకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, బిల్డ్ అప్ ఇస్తూ, బయట తిరుగుతూ, ఫోజులు కొడుతున్న సంగతి తెలిసిందే... దేశంలోనే రిచ్ స్టేట్ అని డబ్బా కొట్టుకుంటూ, మన సొమ్ము ఇప్పటికీ లాక్కుని బ్రతుకుతున్న తెలంగాణా సంస్థ పై దూకుడుగా ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా దూకుడుగా ఉండాలి అనుకున్నారో, చంద్రబాబు ఈ మధ్య అలాగే ఉంటున్నారు..
విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ఇంకా ఏపీకి రూ.5,000 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కరెంట్ అన్నది ఫ్రీగా రాదని, ఆ బాకీని తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోతే న్యాయపరంగా వెళతామని బాబు హెచ్చరించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన ప్రజావేదికలో భాగంగా ‘విద్యుత్-మౌలిక రంగాల్లో అభివృద్ధి’పై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణా విద్యుత్ బకాయల పై స్పందించారు. ఇప్పటికే ఈ విషయం పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా ఏపి ప్రభుత్వం కేసు వేసింది.
తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)ల నుంచి రూ.5732.40 కోట్లు బకాయి రాబట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జెన్‌కో) , ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు వేసింది. నోటీసులిచ్చినా తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు స్పందించలేదని.. టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ల దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌లో ఏపీ జెన్‌కో వేర్వేరుగా రెండు దరఖాస్తులు దాఖలు చేసింది. అయితే అక్కడ కేసు నడుస్తూ ఉండగానే, ఇప్పుడు చంద్రబాబు, కోర్ట్ కి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం చోద్యం చూస్తుంది.