అభివృద్ధిలో ఆంధ్రా దూసుకుపోతోంది. ఇప్పటివరకు టాప్ లో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను అధిగమించి ఫస్ట్ ర్యాంక్ లోకి రావడం విశేషం. ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం ఏపీ 10.5 అభివృద్ధితో దేశంలోనే టాప్ వన్ రాష్ట్రంగా నిలిచింది. రెండంకెల వృద్ధి రేటును సాధించడం ద్వారా గతంలో టాప్ లో ఉన్న తెలంగాణ రెండో స్థానంలోకి, కర్నాటక-3, మహారాష్ట్ర-6, పంజాబ్-14 స్థానాల్లోకి వెళ్లిపోయాయి. 2014-15 విభజన జరిగిన సంవత్సరంలో ఏపీ గ్రోత్ 9.2 శాతంగా ఉంది. ఆ తరువాత రెండో స్థానానికి ఎగబాకింది.

gujarat 29102018 2

ఆ తుదపరి సంవత్సరమే డబుల్ డిజిట్ గ్రోత్ (10.6 శాతం) సాధించినా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక అప్పట్నుంచి రాష్ట్రం డబుల్ డిజిట్ గ్రోత్ లోనే కొనసాగుతోందని ప్లానింగ్ విభాగం అధికారులు చెప్పారు. ఇక తలసరి ఆదాయం కూడా రూ. 40 వేలకు పైగా నమోదు చేసిందంటున్నారు. 2014-15లో 6.8 శాతం అభివృద్ధి నమోదు చేసిన తెలంగాణ.. 2017-18లో 10.4 శాతం నమోదు చేసిందని అధికారులు పేర్కొన్నారు. మరో పక్క అమరావతి పై సమీక్షలో, అమరావతి భవిష్యత్‌ తరాల రాజధాని అని.. సాంకేతికత, నవకల్పనలు, సంస్కృతుల మేలి కలయిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని అత్యాధునిక మౌలిక సదుపాయాలకు కేంద్రంగా, ఉత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా, సాధారణ ప్రజానీకంతో పాటు మేధావులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read