సహజంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే చెల్లింపులు అన్నీ, ఆర్బీఐ నుంచే జరుగుతాయి. సహజ ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వం పంపించే అన్ని బిల్లులను ఆర్బీఐ ఎటువంటి కొర్రీలు లేకుండా అప్రోవ్ చేస్తుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంపిన ఒక బిల్లుని మాత్రం తిప్పి పంపటం, సంచలనంగా మారింది. దీని వెనుక కారణం లేకపోలేదు. ఈ మధ్య కాలంలో ఏపి ప్రభుత్వం ఏది చేసినా సంచలనమే. అలాగే మార్చ్ 31వ తారిఖు, రాత్రి 11.50 గంటలకు ఒక బిల్లు చెల్లింపు ఆర్బీఐ వద్దకు వెళ్ళింది. అయితే ఆ బిల్లు విలువ రూ.1,100 కోట్ల. చెల్లింపు అమయం, ఆర్ధిక ఏడాది పది నిమిషాల్లో ముగుస్తుంది అనగా. సారిగ్గా ఇక్కడే ఆర్బిఐ అభ్యంతరం చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్ల చెల్లింపు విషయంలో, ఆర్ధిక ఏడాది పది నిమిషాల ముందు ఫైల్ రావటంతో, ఆర్బిఐ దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు సమయం అయిపోయిందని, ఈ బిల్లుని వచ్చే ఆర్ధిక ఏడాదిలో, బడ్జెట్ లో, చూపించి, ఫైల్ తిరిగి పంపిస్తే, తాము ఆమోదిస్తామని ఏపి ప్రభుత్వానికి చెప్పింది. అయితే ఏపి ప్రభుత్వం మాత్రం, మేము సమయానికి పంపించామని, మీ దగ్గర ఆలస్యం అయ్యిందని, ఎలాగైనా, అది పోయిన ఆర్ధిక ఏడాదిలోనే చూపించాలని ఆర్బిఐకి చెప్పగా, దానికి ఆర్బిఐ ఒప్పుకోలేదు. దీంతో, ఈ రూ.1,100 కోట్లని, సస్పెన్స్ ఎకౌంటులో చూపించి, పోయిన ఆర్ధిక ఏడాది బిల్లులోనే చెల్లింపులు చేయాలని, ప్రభుత్వం ఆలోచిస్తుంది.
సహజంగా ఏదైనా బిల్లులో స్పష్టత లేకపోయినా, డబ్బులు తిరిగి వచ్చినా, అవి సస్పెన్స్ ఎకౌంటు లో పెట్టి, తరువాత కారణం తెలుసుకుని క్లియర్ చేస్తారు. అయితే ఇక్కడ కూడా ప్రభుత్వం అలాగే చేయాలని ఆలోచిస్తుంది అంటూ ఒక పత్రికలో వచ్చిన కధనం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అసలు ప్రభుత్వం ఈ బిల్లు విషయంలో ఎందుకు ఇంత పట్టుదలగా ఉంది అనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. వచ్చే ఆర్ధిక ఏడాదిలో, కొత్త తేదీ వేసి, ఆ బిల్లు క్లియర్ చేయవచ్చు కదా, ఇందులో ఏమి ఇబ్బంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతలా ఆర్బిఐతో డీ కొట్టి మరీ, బిల్లు ఎందుకు క్లియర్ చేయాలని అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. ఈ ఒక్క బిల్లు పైనే ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనే వాదన వస్తుంది. ఇప్పటికే అనేక వేల కోట్ల బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వాటి కోసం కాంట్రాక్టర్ లు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఒక్క బిల్లు విషయంలో, అదీ ఆర్ధిక ఏడాది పది నిమిషాల్లో ముగుస్తుంది అనగా, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్ధం కావటం లేదనే విశ్లేషణ వస్తుంది. మరి ప్రభుత్వం, దీని పై ఎలా స్పందిస్తుందో చూడాలి.