నెల్లూరు జిల్లాలో ఉన్న కబాడీపాలెంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించి, ఆ స్థలంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటం పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పై, సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్, రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఎస్సీల కోసం నిర్మించిన హాల్ లో, గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటం వల్ల, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. శుభకార్యాల కోసం, ఎస్సీల అభ్యున్నతి కోసం, ఈ ప్రభుత్వం ఎస్సీ కమ్యూనిటీ హాల్ లను నిర్మించిందని, ఇటువంటి హాల్స్ లో, ప్రభుత్వ కార్యాలయాలు ఎలా నిర్మిస్తారని, ఆయన ప్రశ్నించారు. ఎస్సీకి ఏ ప్రయోజనాల కోసం అయితే, ఈ హాల్స్ నిర్మించారో, ఆ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని, ఆయన కోర్టుకు తెలిపారు. దీంతో, పిటీషన్ ను పూర్తిగా పరిశీలించి, వాదనలు విన్న హైకోర్టు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే ఆ కమ్యూనిటీ హాల్ లో ఉన్న సచివాలయాన్ని, అక్కడ నుంచి వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మునిసిపల్ కమీషనర్ నాలుగు వారాల్లో ఈ కమ్యూనిటీ హాల్ నుంచి, ఖాళీ చేసి, వేరే చోటకు ప్రభుత్వ కార్యాలయాన్ని మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read