రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు... అన్ని వైపుల నుంచి మనల్ను ఇబ్బంది పెట్టే పనులు చేసారు... తొమ్మిదో, పదో షెడ్యూల్ లో ని ఆస్తుల విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు... కేంద్రం అసలు పట్టించుకోలేదు.. ఎదో ఒక కమిటీ వేసి ఊరుకుంది... అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, వదలకుండా ఆ కమిటీతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది... ఇవన్నీ తెలంగాణాలో ఉన్న ఆస్తులు కాబట్టి, జగన్ కాని, పవన్ కాని, కెసిఆర్ ను అడిగే ధైర్యం లేదు... అయితే 4 ఏళ్ళ తరువాత ఒక కీలకమైన, విలువైన ఆస్తిని, ఏపి సొంతం చేసుకుంది... అదే ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్... కొండపల్లిలో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్ ఆస్తులు ఇప్పుడు ఏపికి వచ్చాయి...
1994 నుంచి సింగరేణి అనుబంధ సంస్థగా ఉంటూ వస్తున్న ఏపీహెచ్ఎంఈఎల్ ను ఇటీవలే ఏపీ పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి కేటాయిస్తూ షీలాబిడే కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం లభించింది. దీంతో సింగరేణితో ఈ సంస్థకు ఉన్న 24 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాంతం ప్రాతిపదికన సింగరేణిలో 51 శాతం వాటాను తెలంగాణకు కేటాయించారు. ఈ లెక్కన సింగరేణిలో తెలంగాణకి 51శాతం, కేంద్రానికి 49శాతం వాటా ఉంది. సింగరేణికి అనుబంధగా ఉన్న ఏపీహెచ్ఎంఈఎల్ ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలంటూ ఏపి ప్రభుత్వం డిమాండ్ చేసింది. పునర్విభజన చట్టం ప్రకారం ఈ సంస్థ ప్రాంతం ప్రాతిపదికన ఏపీకే దక్కాలనే డిమాండ్ పెరిగింది.
ఏపీహెచ్ఎంఈఎల్ సంస్థకు కొండపల్లిలో 206 ఎకరాల స్థలంతోపాటు విజయవాడ బెంజ్‌సర్కిల్ సమీపంలోని ఆటోనగర్ వద్ద ఖరీదైన ఐదెకరాల భూమి ఉంది. ఏపీ రాజధాని అమరావతి నుంచి కొండపల్లికి కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపట్టడానికి సన్నాహాలు జరుగుతుండటంతో ఆప్మెల్ భూములు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేయనున్నాయి. ప్రస్తుతం కొండపల్లి వద్ద ఎకరా భూమి విలువ రూ.10 కోట్లు, ఆటోనగర్‌లో ఎకరాకు రూ.25 నుంచి రూ.30 కోట్లకుపైగా ధర పలుకుతుందని అంచనా... అయితే, తొమ్మిదో, షెడ్యూల్ లో పెట్టిన ఒక్క సంస్థ మాత్రమే మనకు వచ్చింది... ఇంకా అనేక సంస్థల్లో మనాకు వాటా ఉంది.. దాదాపు 40 వేల కోట్లు విలువ అని అంచనా.. ఎలాగు ప్రతిపక్షాలు, కేంద్రం ఇవి పట్టించుకోదు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇవి కూడా సాధించాలి, అవసరం అయితే కోర్ట్ కు కూడా వెళ్లి, మన ఆస్తులు మనం సాధించుకోవాలి...