ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, తీవ్ర అసహనంతో ఉన్న ఉద్యోగులు, ఇక ఓర్పు నశించి, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి పైనే, బహిరంగంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే జీతాలు ఫస్ట్ తారీఖుకి ఇవ్వక, అలాగే పీఆర్సి ఇవ్వక, డీఏలు పెండింగ్ లో పెట్టి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక, ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. ఏడో తేదీ నుంచి, వాళ్ళు అనేక ఆందోళనలకు పిలుపు ఇచ్చారు. ఈ నేపధ్యంలో, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు మాటలు ఇప్పుడు పెను సంచలనం రేపాయి. ఏపీ ఎన్జీవోల అంతర్గత సమావేశంలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు చేసిన ఘాటైన వ్యాఖ్యలు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఉద్యోగ వర్గాల్లో కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసాయి. ఆ అంతర్గత సమావేశంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు , నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జగన్ మాయ మాటలు విని, నమ్మి, మాయలో పడి, 151 సీట్లు గెలిపించాం అని అన్నారు. అదే విధంగా ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పార్టీ, గెలిచిన మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ల గురించి ప్రస్తావిస్తూ, ఆరిపోయే దీపం ముందుగా, వెలుగు ఎలా ఇస్తుందో, అలాగే ఇక్కడ గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఉద్యోగులు పరిస్థితి ఏంటో గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబుకు కూడా బాగా తెలుసుని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన సంఘంలో 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగి ఇంట్లో అయుదు ఓట్లు వేసుకున్నా, మొత్తం 60 లక్షల మంది ఓట్లు ఉంటాయని, మనం తలుచుకుంటే, ప్రభుత్వాన్నే కూల్చి పడేయ వచ్చని అన్నారు. ఉద్యోగాల శక్తి ముందు ఎవరైనా సరే, తల వంచాల్సిందే అని బండి శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతుల ఉద్యమానికి ప్రధాన మంత్రి నమస్కారం పెట్టి, క్షమాపణ చెప్పారని, రేపటి నుంచి మన ఉద్యమం కూడా అలాగే కొనసాగాలని ఆయన కోరారు. జీతం అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అని, కనీసం జీతం కూడా ఇచ్చే పరిస్థితి లేదని. పాల వాళ్ళు, కిరాణా వాళ్ళు కూడా, ప్రభుత్వ ఉద్యోగి అంటే చీదరించుకునే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో, ఈ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/vgS-_Uppg4E