అపోలో టైర్స్... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కంపెనీ ఇది... ఈ పరిశ్రమను మన రాష్ట్రం తీసుకురావటానికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు.... ఒక పక్క తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలు ఈ సంస్థ కోసం పోటీ పడినా, మన రాష్ట్రానికి తీసుకురావటానికి చంద్రబాబు ఎన్నో తాయిలాలు ప్రకటించి కంపెనీ తీసుకువచ్చారు... కంపెనీ వచ్చిన తరువాత, భూమి విషయంలో కూడా కొంత మంది అక్కడ ప్రజలను రెచ్చగొట్టారు... అందరూ ఇచ్చినా, అతి కొద్ది మంది వలన, భూకేటాయింపు కూడా లేట్ అయ్యింది.. చివరకు, ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను అధిగమించి, ఈ రోజు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరిగింది...
అయితే భూ కేటాయింపు జరుగుతున్న సమయంలో కూడా తమిళనాడు ఈ ప్రాజెక్ట్ లాగెయ్యటానికి ప్రయత్నం చేసింది...సత్యవేడు ప్రాంతంలో నీటివసతి లేని కారణంగా తమిళనాడు వెళ్ళిపోతాం అని చెప్పింది. దీంతో ముఖ్యమంత్రి స్పందించి.. సమీపంలోని తెలుగుగంగ ఉపకాలువ ద్వారా నీటివసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని ఆంక్షలకు కట్టుబడి ఇక్కడ పరిశ్రమ స్థాపనకు మార్గం సుగమం చేసింది. అంతే కాదు అగ్రిమెంట్ లో ఎన్నో ఆంక్షలను ప్రభుత్వం సడలించింది... పెద్ద కంపెనీ కాబట్టి, ఎలాగైనా ఈ కంపెనీ ఇక్కడకు వస్తే, మిగతా వారు కూడా ఇక్కడ ప్లాంట్ నెలకొల్పుతారు అనేది ముఖ్యమంత్రి ఆలోచన...
చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ నిర్మాణానికి 260 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించింది. రూ.1200 కోట్ల పెట్టుబడి వ్యయంతో 600మందికి ప్రత్యక్షంగా, మరో 600 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో అపోలో టైర్ల పరిశ్రమకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే ఈ పరిశ్రమను అంత ఆషామాషీగా ఇక్కడ నెలకొల్పడం లేదు. అపోలో పరిశ్రమ నెలకు 5 వేల టైర్ల ఉత్పత్తి సామర్థ్యంతో మొదలవుతుంది. బస్సులు, ట్రక్కుల కోసం రేడియల్ టైర్లను, ద్విచక్ర వాహనాల టైర్లను ఇందులో ఉత్పత్తి చేస్తారు. దీనికితోడు పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా నెలకొల్పుతారు.