పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు కొవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించిన మటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పలాస ఎమ్మెల్యే అప్పలరాజు ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య సారధిగా...వారధిగా ఉండాల్సిందిపోయి, దగ్గురుండి కొవిడ్- 19 నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు రాష్ట్రంలో ఇతరులు ప్రవేశించకుండా ఉండేందుకు ఉన్న చెక్ పోస్టుల వద్ద ఉన్న బారికేడ్లును ధ్వంసం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి నెలలో వివాహం కోసం చత్తీస్మడ్ రాష్ట్రంలోని బిలాయి ప్రాంతానికి వెళ్లిన సిక్కోలు జిల్లా ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామాలకు చెందిన జనాలు కొందరు లాక్ డౌన్ కారణంతో అక్కడ చిక్కుకుపోయారు. నలభై రోజులుకు పైబడి ఊరురాని ఊరులో తమది కాని ప్రాంతంలో ఇరుక్కుపోయిన వీరు దుర్గా జిల్లా కలెక్టర్ అనుమతితో బస్సులో శ్రీకాకుళం జిల్లాకి బయలుదేరి ఒడిశా రాష్ట్రం మీదుగా మంగళవారం ఉదయం జిల్లాలోకి ప్రవేశించారు.

మెళియాపుట్టి మండలం వసుంధర గ్రామం అనుమతులు ఉన్నా జిల్లాలో ప్రవేశించడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చిన అనుమతులు ఏవి వారి వద్ద లేకపోవడంతో బస్సును ముందుకు కదలనీయకుండా ఆపేసారు. ఈ సమాచారాన్ని అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది మండల స్థాయి అధికారులకు తెలిపారు. దీంతో మెళియాపుట్టి తహశీల్దార్ బస్సులో ఉన్న వారికి యధా ప్రకారం భోజన వసతి కల్పించి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లాలంటూ సూచించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో బస్సు లో వచ్చిన వారు అక్కడ ఆందోళనకి దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ గొడవ పెట్టారు. వారిని అక్కడ ఉన్నతాధికారులు వదిలేయడంతో బస్సు లో ముందుకు సాగారు.

అనంతరం మళ్లీ మెళియాపుట్టి మండలం పట్టువరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టు వద్ద విధులలో ఉన్న పోలీసు సిబ్బంది బస్సును మరోసారి అడ్డుకున్నారు. సుమారు రెండు గంటలపాటు అటు ప్రయాణీకుల బెట్టు.. ఇటు పోలీసుల రూల్స్ పై ఉడుంపట్టు కారణంగా బస్సు నిలిచిపోయింది. బస్సును పోలీసులు అడ్డుకున్న సమాచారాన్ని దానిలో ప్రయాణిస్తున్న వారి కుటుంబ సభ్యులు పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే వట్టుపురం చేరుకొని బారికేడ్లును తొలగించడంతో పోలీసులకు, ఎమ్మెల్యేకి వాగ్వాదం జరిగింది. పోలీసుల పై నేరుగా భౌతిక దాడికి దిగడంతో జిల్లా ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డికి సమాచారం అందించారు. జిల్లా కీలక అధికారుల నిర్ణయంతో ఆ బస్సు లో ఉన్న ప్రయాణీకులను టెక్కలి క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఇదంతా మంగళవారం రాత్రికి రాత్రే సోషల్ మీడియాకి వెళ్లిపోవడంతో.. క్షణాలలో ఎమ్మెల్యే అప్పలరాజు చేసిన ప్రయత్నాలు బయటకు వచ్చేసాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read