ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోలార్, విండ్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, ఈ రంగంలో దేశ విదేశీ పెట్టుబడులు తీసుకోవచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నాలకు దేశ వ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చింది. అంతే కాదు, సోలార్, విండ్ ఎనర్జీ తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉండటంతో, యూనిట్ ధర కూడా తగ్గుతూ వస్తుంది. దీని ప్రభావంతో, వినియోగదారులకు కూడా కరెంటు చార్జీలు తగ్గేవి. అయితే ఇదంతా గతం. 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తరువాత, గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు అన్నీ సమీక్ష చేస్తాం అంటూ, జగన్ ప్రభుత్వం కొత్త విధానంతో ముందుకు వచ్చింది. ఒకసారి పెట్టుబడి పెట్టిన కంపెనీలు సమీక్ష కుదరదని, అటు కేంద్రం, ఇటు కోర్టు చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదో ఒక విధంగా తాను అనుకుంది చేస్తూనే ఉంది. కేంద్రం కూడా ఈ విషయంలో సీరియస్ అవ్వటంతో, అన్ని ఒప్పందాలు సమీక్ష చెయ్యం అని, ఏది అయితే తేడాగా ఉందో అవే సమీక్ష చేస్తాం అని, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే అప్పటి నుంచి, ఈ విషయం పై పెద్దగా వార్తలు లేకపోయినా, ఇప్పుడు మళ్ళీ ఈ విషయం వార్తల్లోకి ఎక్కింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము ఉత్పత్తి చేసిన విద్యుత్ ని కొనటం లేదని, తాము భారీగా నష్టపోతున్నాం అంటూ, అయన్‌ అనే సంస్థ, విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ లో ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లాలో అయన్‌ సంస్థకు, 250 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఉంది. ఇందులో 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, విద్యుత్ పీపీఏల సమీక్ష పేరిట, కొన్ని సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చెయ్యటంలేదు. అందులో ఈ కంపెనీ కూడా ఉంది. ప్రభుత్వం తాము ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ని కొనటం లేదని, అత్యవసర పిటీషన్ గా ట్రిబ్యునల్ లో కేసు వేసారు. దీని పై విచారణ చేసిన ట్రిబ్యునల్, వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ని, ఆలస్యం చేయకుండా, వెంటనే తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ డిస్కం, ట్రాన్స్‌కో సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను, వచ్చే నెల 20వ తేదీకి వాయిదా పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read