ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు కృతజ్ఞత అనేది చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు విషయంలో అది మరీ తక్కువ అనే చెప్పాలి. ఆయన గ్రహపాటు అలాంటిదో ఏమో కాని, ఆయన వల్ల లాభపడిన అనేక మంది, ఆయన వల్ల రాజకీయంగా ఎదిగిన అనేక మంది, ఆయన్నే ఎదురు తిడతారు. ఇప్పుడు జగన్ క్యాబినెట్ తీసుకోండి, స్పీకర్ తమ్మినేని, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, ఇంకా ఎంతో మంది ఎమ్మెల్యేలు, చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష. జూనియర్ ఎన్టీఆర్ రికమెండ్ చేస్తే, రాజకీయాల్లోకి వచ్చిన కొడాలి నాని, ఈ రోజు చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టటం చూస్తున్నాం. ఇక తెలంగాణాలో అయితే, అక్కడ ముఖ్యమంత్రి నుంచి 90 శాతం, చంద్రబాబు స్కూల్ లో నుంచి వచ్చిన వాళ్ళే. ఈ రోజు చంద్రబాబుని ఎలా తిడుతున్నారో చూస్తున్నాం. అయితే, ఇందుకు భిన్నంగా, ఈ రోజు తెలంగాణాలో పరిస్థితి నడుస్తుంది.

bjp 18082019 2

తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తూ, చంద్రబాబుని వదిలి వెళ్తున్నందుకు ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. రెండేళ్ళ క్రితం రేవంత్ రెడ్డి కూడా, ఇలాగే చంద్రబాబుని వదిలి వెళ్తూ, ఆయన పెట్టిన రాజకీయ భిక్షని గుర్తు చేసుకుంటూ, భావోద్వేగంతో పార్టీని వీడారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిన సీతక్క కూడా, ఇప్పటికీ చంద్రబాబు అంటే అభిమానం చూపిస్తూ, ఆయనకు రాఖీ కడుతూ ఉంటారు. అయితే ఈ రోజు, హైదరాబాద్ లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ముందే, చంద్రబాబు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు కొంత మంది నాయకులు. ఈ రోజు తెలంగాణా తెలుగుదేశం నాయకులు కొంత మంది, బీజేపీలో చేరారు. ఈ సందర్భంలో, రాజ్యసభ ఎంపీ గరికపాటి, మహిళా నాయుకులు శోభారాణి, పాల్వాయి రజనీ కుమారి, చంద్రబాబుని తలుచుకుని భావోద్వేగానికి గురైయ్యారు.

bjp 18082019 3

శోభారాణి, రెండు రోజుల క్రిందట చంద్రబాబుకి లేఖ రాసి, అధ్యక్షా అర్ధం చేసుకోండి, మీరు నాకు రాజకీయ జీవితం ఇచ్చారు, మిమ్మల్ని వదిలి వెళ్తున్నా అని అన్నారు. అలాగే ఈ రోజు మీటింగ్ లో కూడా మహిళా నేత పాల్వాయి రజనీ కుమారి కూడా, బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబును వదిలిపోతున్నందుకు నోట మాటరావడం లేదని ఆమె ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ఇక గరికపాటి మోహన్ రావ్ అయితే, తెలంగాణాలో తెలుగుదేశం పరిస్థితి ఇలా అవ్వటానికి, అక్కడ చాలా మంది ఉన్నారని, చంద్రబాబు తప్పు ఏమి లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండగా చేసినా ఉద్యమాలు, బాబ్లీలో వీపులు పగులగొట్టించుకున్నామని, చంద్రబాబుతో కలిసి చేస్తున్న పాదయాత్రని తలుచుకుని, పార్టీ గొంతుకోయాలనుకునే వాళ్లు వేరే ఉన్నారని, వాళ్ల తీరును తాను ప్రశ్నిస్తున్నానని గరికపాటి మోహన రావు ఉద్వేగానికి లోనయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read