ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అనుసరించిన డిజిటల్ వాల్యూయేషన్ పై అభ్యర్థుల్లో వివిధ అనుమానాలున్నాయని, వాటిని నివృతి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, ప్రభుత్వంపైనే ఉందని టీడీపీనేత, తెలుగుయువతరాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. 7 వేల మంది వరకు గ్రూప్ -1 పరీక్ష రాయగా 340మందిని మాత్రమే ఇంటర్య్యూలకు ఎంపిక చేశారని, పరీక్ష రాయడానికి ముందు డిజిటల్ పద్థతిలో వాల్యూయేషన్ ఉంటుందని ఎక్కడాచెప్పలేదన్నారు. 7వేలమంది పరీక్షలు రాస్తే, ఒక్కో అభ్యర్థి కనీసం పది పేపర్లు రాశాడనుకున్నా, దాదాపు 70వేల పేపర్లు ఉంటాయన్నారు. కరోనా క్లిష్ట సమయంలో ఆ పేపర్లను థర్డ్ పార్టీకి కరెక్షన్స్ కోసం పంపారన్నారు. ఈ వ్యవహారంపై కొందరు అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారని, వారి విజ్ఞప్తితో న్యాయస్థానం పేపర్ల తరలింపు, వాల్యూయేషన్ పై విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు. కొందరు అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారులను కలిసి, సమస్య గురించి వివరిస్తే, వారిని దుర్భాషలాడటం జరిగిందన్నారు. గ్రూప్ -1 పరీక్షలతీరు, వాల్యూయేషన్ పై టీడీపీజాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్ కూడా పలుమార్లు అభ్యంతరం వ్యక్తంచేయడం జరిగిందన్నారు. ఇంటర్వ్యూకి ఎంపిక చేసిన అభ్యర్థులతోపాటు, వారి జవాబు పత్రాలను, ఇంటర్వ్యూకి ఎంపికకాని వారి జవాబుపత్రాలను కూడా తక్షణమే ఆన్ లైన్ లోఉంచాలని చినబాబు డిమాండ్ చేశారు. ఆవిధంగా చేస్తే, మరలా పరీక్షలు నిర్వహించే సమయానికి అభ్యర్థులు వాటిని పరిశీలించి, కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంద న్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షనేతలను భయపెట్టి, తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నాడన్నారు. కరోనా సమయంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ మంచిదికాదని ప్రతిపక్షం చెబుతున్నాకూడా ముఖ్యమంత్రి తన నిద్రావస్థను వీడటం లేదన్నారు. పది,ఇంటర్ పరీక్షలు రద్దుచేస్తే, భవిష్యత్ లో విద్యార్థులకు ఇబ్బందులువస్తాయని ముఖ్య మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పరీక్షలు వాయిదావేయడం, రద్దుచేసిన రాష్ట్రాలన్నీ విధ్యార్థుల భవిష్యత్ గురించిఆలోచించకుండానే నిర్ణయం తీసుకున్నాయా అని శ్రీరామ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూకూడా బయట కురాకుండా విద్యార్థులను మాత్రం విధిగా పరీక్షలు రాయాలనడం ఎంత వరకు సమంజసమన్నారు. జగన్ వస్తే ఉద్యోగాలు వస్తాయి.... పరిశ్రమలు వస్తాయని నమ్మి, యువత అంతా ఆయనకు ఓట్లేశారని, ఇప్పుడే అదేయువత ముఖ్యమంత్రి ని దారుణంగా దూషించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. ఈముఖ్యమంత్రి వచ్చాక కనీసం ఒక్కటంటే ఒక్క నోటిఫికేష న్ కూడా వెలువడలేదన్నారు. ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబర్ గా సోనీవుడ్ అనేవ్యక్తిని నియమించడాన్ని శ్రీరామ్ చినబాబు తప్పుపట్టారు. సదరువ్యక్తి తనకు తానుగా కొన్ని వ్యవస్థల ను నడుపుతన్నాడనే అభియోగాలున్నాయన్నారు. అతని నియామకాన్ని తాము తప్పుపడుతున్నామని, ఇప్పటికే ఉన్నతమైన పదవుల్లోఉన్న సోనీవుడ్ కు రాజ్యాంగపదవి అప్పగించడం ముమ్మాటికీ తప్పేనని టీడీపీనేత స్పష్టంచేశా రు. క-రో-నా సమయంలో ప్రజలు అర్థాకలితో అలమటిస్తూ, అన్నమోరామచంద్రా అని విలపిస్తున్నారన్నారు. గతప్రభుత్వం నిర్వహించిన అన్నాక్యాంటీన్లు మూసేసిన ఘనత ఈ దరిద్రపు ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. డబ్బులతో ఓట్లుకొనొచ్చన్న ఆలోచనల్లో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడన్నారు. ప్రజలంతా తమప్రాణాలు కాపాడాలని, వ్యాక్సిన్లు అందించాలని మొత్తుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డే మో పథకాలపేరుతో ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సలహాలు, సూచనలు తీసుకొని ఉంటే, రాష్ట్రంలో ఇంతటి దారుణాలు జరిగేవికావన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల్లో జరిగిన అక్రమాలను టీడీపీ వెలికితీస్తుందని, తెలుగుయువత తరుపున ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టి తీరుతామని చినబాబు తేల్చిచెప్పారు. తెలుగు యువత విభాగం, నారాలోకేశ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతూ, దుర్మార్గపు ఆలోచనలతో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి తగినవిధంగా బుద్ధిచెబుతుందన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలనిర్వహణ, వాల్యూయేషన్ పై తక్షణమే నిజనిర్థారణ కమిటీవేయాలని, అవసరమైతే ఆకమిటీలో కొందరు అభ్యర్థులకు కూడా అవకాశమివ్వాలని చినబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.