జగన్ కొన్ని రోజులుగా జపిస్తున్న "నేనే సియం", "నేనే సియం" అనే నినాదం, రిపబ్లిక్ ఛానల్ అర్నబ్ గోస్వామికి తగిలినట్టు ఉంది... పాపం జగన్ బాధ చూసి తట్టుకోలేక, జగన్ ను కనీసం తన ఛానల్ లో అయినా సియం చెయ్యాలి అని అర్నబ్ అనుకున్నారో ఏమో పాపం, నిన్న ఒక సర్వే అంటూ హడావిడి చేసాడు అర్నబ్... ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, మన రాష్ట్రానికి ఉన్న 25 ఎంపీ సీట్లలో, జగన్ పార్టీకి 13 సీట్లు వస్తాయి అని చెప్పాడు... అంటే సగానికి పైగా పార్లమెంట్‌ సీట్లు గెలుచుకుంటే...అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మెజార్టీ మార్కు దాటుతుందని అర్నబ్ అంచనా వేసి అలా అయినా కొన్ని రోజులు జగన్ ను సియం భ్రమలో ఉంచింది...

arnab 19012018 2

2014 లో జగన్ కు వచ్చిన ఎంపీ సీట్లు 8... ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లిమెంట్ తప్ప, ఎక్కడా కన్ఫర్మ్ సీట్ లేదు... అటు తిప్పి, ఇటు తిప్పి చూసినా, మహా అయితే 3 నుంచి 5 సీట్లు వస్తాయి అనేది ఇక్కడ ఉన్న వారి అంచనా... అలాంటిది ఏ ప్రాతిపదికన 13 వస్తాయి అంటున్నాడో అర్నబ్ కే తెలియాలి.. అసలు జగన్ అనే వాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాడని జనం మర్చిపోయి చాలా రోజులు అయ్యింది... మరో పక్క చంద్రబాబు అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండిటిలో సమానంగా దూసుకుపోతున్నారు... అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబును కాదని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌ కావాలని ఎవరైనా కోరుకుంటారా ?

arnab 19012018 3

ఈ రిపబ్లిక్ టీవీ, అమిత్ షా మౌత్ పీస్ అనే ప్రచారం కూడా ఉంది... అన్ని రాష్ట్రాల్లో NDAకి అనుకూలంగా సర్వే చెప్పిన అర్నబ్, మన రాష్ట్రంలో మాత్రం జగన్ కు అనుకూలంగా చెప్పాడు... అంటే, దీని వెనుక బీజేపీ పెద్దల ఆలోచన ఎమన్నా ఉందా ? అసలు ఈ సర్వే కామెడీ ఇది... 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అర్నబ్ రిపబ్లిక్, సీ వోటర్ సర్వే చేసింది 60,000 మందిని... అంటే సగటున ఒక నియోజకవర్గానికి కేవలం 110 మంది... 25 నియోజకవర్గాలకు గానూ ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు 3.68 కోట్లు... అంటే సగటున ఒక నియోజక వర్గానికి 14 లక్షల 72 వేల మంది ఓటర్లు... 14,72,000 ఓటర్లకు గానూ 110 మందిని సర్వే చెయ్యడం అంటే సర్వే శాంపిల్ సైజు 0.0074%.. ఇదో సర్వే.. మళ్ళీ దీనికో పెద్ద బిల్డ్ అప్... ఇది చూపించి జగన్ ను బకరా చెయ్యటం తప్ప మరే ఉపయోగం లేదు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read