మా జీవితాలు నాశనం చెయ్యద్దు, మిమ్మల్ని నమ్ముకుని ఓటు వేసాం, నెల రోజుల్లోనే ఇలా చేస్తారా అంటూ, ఆరోగ్యమిత్రలు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు తాడేపల్లిలో ఉన్న జగన్ నివాసం దగ్గరకు వందలాదిగా వచ్చిన ఆరోగ్యమిత్రలు ఆందోళన చేస్తూ, తమ నిరసన తెలియచేసారు. జగన్ వస్తే తమ జీవితాలు మారతాయని ఓటు వేసి గెలిపించుకున్నామని, ఇప్పుడు అసలు తమ ఉద్యోగాలకే ఎసరు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేసారు. 11 ఏళ్లుగా మేము ఈ పని చేస్తున్నామని, ఇప్పుడు కొత్తగా పుట్టుకుచ్చిన వాలంటీర్లకు తమ విధులు అప్పగిస్తారన్న సమాచారం ఉందని, ఇలా చేస్తే మేము ఏమి చెయ్యాలి అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ నిరసనలో 13 జిల్లాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు. మాకు జీతం ఇవ్వరని, కమీషన్ ప్రాతిపదికన పని చేస్తామని, అయినా సారే ఎలాగోలా నేట్టుకోస్తుంటే, ఇప్పుడు ఇది కూడా లేకుండా చేస్తారా, మా పని వాలంటీర్లుకు ఇస్తే, మా కమీషన్ తగ్గిపోదా అని నిలదీశారు.
గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రాగానే, తమను తీసేస్తారనే ప్రచారం జరుగుతోందని, దీని పై జగన్ క్లారిటీ ఇవ్వాలని, ఉద్యోగాలకు భరోసా ఇవ్వాలని కోరారు. పోలీసులు ఎంత వారించినా వినకపోవటంతో, నిరసన చేస్తున్న మహిళలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల వ్యవహరించిన తీరు పై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన మాకు, ఇదేనా చేసే న్యాయం అంటూ నినాదాలు చేసారు. రాష్ట్రంలో ఆరోగ్య పధకాలు అమలు చెయ్యటం వీరి పని. ఆరోగ్య పధకలాను ప్రజల్లోకి తీసుకు వెళ్లి, రోగికి వైద్య సహాయం అందిచటం, పధకాల గురించి అవగాహన, శస్త్ర చికిత్స జరిగిన సమయంలో బాగోగులు, తిరిగి ఇంటికొచ్చిన తరువాత మందులు తీసుకునేలా చైతన్య పరచడం, చికిత్స జరిగిన విధానంలోని అభిప్రాయాలు, ఫిర్యాదుల నమోదు, వైద్యశిబిరాలు నిర్వహించడం ఇంకా ఎన్నో వీరి విధులు. ప్రభుత్వానికి, ప్రజలకు వైద్య మరియు ఆరోగ్య సలహాలు అందించే ఓ వారధి అని చెప్పవచ్చు.ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఆరోగ్యమిత్రలను తీసేసి, వాలంటీర్లు బాధ్యత అప్పగిస్తారని, రాష్ట్ర ఉన్న 18 వేల మంది ఆరోగ్య మిత్రల భ్యవిషత్తు నాశనం చెయ్యవద్దని జగన్ ని కోరుతున్నారు.