ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కేసుల్లో ఇరికించడానికి అన్ని దారులూ వెతికారు. ఏ విధంగానూ ఆయన అందనంత ఉన్నత స్థాయిలో ఉన్నారు, అని తెలుసుకుని, ఆయన్ను ఏ అవినీతి కేసులో ఇరికించలేము అని నిర్ధారించుకుని, చివరికి తేలిపోయే బాబ్లీ ప్రాజెక్టు వద్ద నిరసన కేసును తిరిగి తోడారు. ప్రజల కోసం పోరాటం చేసిన విషయంలో అరెస్టు కావడానికి ఆయన వంటి వాళ్లకు పెద్ద ప్రాబ్లమ్ లేదు, కాదూ. ఆ రోజుల్లోనే ఆయన ఆ కేసులో కనీసం బెయిల్ కూడా నిరాకరించారు ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని పట్టుబట్టారు.
నిజానికి ఇది 2010లో చేసిన పోరాటం. అప్పట్లో తెలంగాణా కోసం చంద్రబాబు చేసిన వీరోచిత పోరాటం అది. అయితే ఎప్పుడో 8 ఏళ్ళ కేసు పై, ఎవరో వచ్చి కోర్ట్ లో పిటీషన్ వేసి, దీని సంగతి ఏంటో తేల్చండి అని అన్నారు. మరి ఇది ఎవరి ఒత్తిడితో చేసారో మరి. నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి పిటిషన్ వేయడంతో మళ్లీ ఈ అంశం తెరపైకొచ్చింది. వారెంట్ ఎందుకు అమలు చేయలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. అరెస్ట్ చెయ్యాలని ఆదేశించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు మాత్రం, ఇది పెద్ద విషయం కాదని అంటున్నారు. ఇవన్నీ వస్తూనే ఉంటాయని, ఒక వేళ కక్ష సాధించటానికి ఎమన్నా చేస్తే మాత్రం, లీగాల్ గా ప్రొసీడ్ అవుతామని అంటున్నాయి.
ఎన్నికల వేడి రాజుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో తేనెతుట్టు కదుపుతున్నారు. బూమరాంగ్ అయ్యి తమకే చుట్టుకుంటాయ్ అని మరచిపోతున్నారు. దీని వెనకాల పనిచేస్తున్న ఢిల్లీ పెద్దలు, తెలంగాణాలో ఉన్న ఢిల్లీ పెద్దల స్నేహితులు, జనం అన్నీ గమనిస్తున్నారు అనే విషయం మర్చిపోకండి....తమకు రాజకీయంగా అడ్డు వచ్చిన వాళ్ళను అడ్డు తొలగించుకునేందుకు ఇలా వ్యవస్థలను వాడుకుంటున్న ఢిల్లీ పెద్దలు, దాన్ని సమర్ధిస్తున్న గులాబీలను నలిపి పారేయక మానరు.