రాయపాటి సాంబశివరావు ఇంట్లో జరిగిన సీబీఐ సోదాలపై చంద్రబాబునాయుడు స్పందించాలంటున్న వైసీపీనేత జోగిరమేశ్, కొన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు హితవుపలికారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "రాయపాటి సాంబశివరావుకి, ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీకి పోలవరం కాంట్రాక్ట్ ను అప్పగించింది చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రభుత్వం కాదని జోగి రమేశ్ తెలుసుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించింది. ఆ కాంట్రాక్ట్ రద్దుచేస్తే పోలవరం పనుల్లో జాప్యం జరుగుతుందని, రీటెండర్ పిలిస్తే, నిర్మాణ వ్యయం పెరుగుతుందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు చెప్పినందున, సదరు టెండర్ ను టీడీపీ ప్రభుత్వం రద్దుచేయలేదు. సబ్ కాంట్రాక్టు లను వివిధ కంపెనీలకుఇచ్చి, సదరు కంపెనీలవారికి ఇబ్బందులు లేకుండా పోలవరం పనులు వేగంగా జరిగేలా చేయడం జరిగింది. దానివల్లే పోలవరం పనులు టీడీపీ హాయాంలో 72శాతం వరకు జరిగాయని రమేశ్ గ్రహించాలి. ఆ ఘనత రాయపాటిదో, ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీదో కాదు...చంద్రబాబుది. జగన్మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి ల అవినీతిపనులు, అక్రమ సంపాదనలో వైసీపీనేతలకు, జోగిరమేశ్ కు వాటా ఉందనేది ఎంత నిజమో, రాయపాటికి, ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీకి అప్పగించిన పనుల్లో చంద్రబాబునాయుడికి వాటా ఉందనేది కూడా అంతేనిజం. తిరుమలస్వామివారి నగలు మాయమయ్యాయని, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడి ఇంట్లో ఉందని గతంలో ప్రచారం చేసిన వైసీపీనేతలు, తరువతా పింక్ డైమండ్ కి సంబంధించిన కేసుని కోర్టుల నుంచి ఎందుకు వెనక్కు తీసుకున్నారో చెప్పాలి. లోకేశ్ కు బినామీ శేఖర్ రెడ్డి అనిచెప్పినవారు నేడు, టీటీడీ బోర్డు మెంబర్ గా అతనికి ఎందుకు అవకాశమిచ్చారు.

రాయపాటి సాంబశివరావు బ్యాంకులనుంచి తీసుకున్న రుణాల్లో ఏవైనా అవకతవకలకు పాల్పడితే, బ్యాంకులే ఆయనపై చర్యలు తీసుకుంటాయి. గతంలో వాకాటి నారాయణరెడ్డిపై ఆరోపణలు వస్తే, వెంటనే ఆయన్ని టీడీపీనుంచి సస్పెండ్ చేశాము. ఇప్పుడు వైసీపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఏంచేసిందో జోగిరమేశ్ చెప్పాలి. వైసీపీఎంపీ హోదాలో రచ్చబండ పేరుతో ముఖ్యమంత్రిని, వైసీపీ వారిని తిడుతున్నది ఎవరో మీకుతెలియదా? టీడీపీనుంచి వైసీపీలో చేరినావారి జాతకాలు చెబితే మీరు తట్టుకోలేరు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. చంద్రబాబునాయుడి ఆస్తులపై ఆయనే సీబీఐ విచారణ కోరాలంటున్న వైసీపీనేతలు ఒక్కపనిచేయగలరా? నిజంగా వారికి దమ్ము, ధైర్యముంటే, జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న అవినీతికేసుల విచారణ 6నెలల్లో పూర్తిచేయమని కోరుతూ ఆయనే సుప్రీంకోర్టుకి లేఖరాసేలా, మీ ముఖ్యమంత్రి తనకు తానే బెయిల్ అవసరం లేదంటూ ఒక అఫిడవిట్ కోర్టులో వేసేలా ఆయనపై ఒత్తిడి తేగలరా? జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ వేయించేందుకు వైసీపీ వారు సిద్ధమైతే తాముకూడా సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమే. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడిపై 26 కేసులు వేస్తే, ఒక్కటంటే ఒక్కటే ఇప్పుడుపెండింగ్ లో ఉంది. 26 కేసులు వేసి, ఒక్కటంటే ఒక్కదానిలో కూడా ప్రాథమికఆధారాలను చూపించలేకపోయారు. మీ ఛాలెంజ్ కి మేముసిద్ధమే.. మా ఛాలెంజ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డితో సుప్రీంకోర్టులో అఫిడ విట్ వేయించగల ధైర్యం మీకుందా?

Advertisements

Advertisements

Latest Articles

Most Read