దేశంలో ఐటి దాడులు జరిగితే తెలుగుదేశంపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ... పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ నేతలు టీడీపీపై అవినీతి ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు మాజీ సీఎస్‌ వద్ద ఐి దాడుల్లో రూ. 2 వేల కోట్లు దొరికాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. జగన్‌, ఆయన బృందానికి ఇంగ్లీష్‌ రాకపోతే ఐి శాఖ ప్రకటనను ఇంగ్లీష్‌ వచ్చిన వారి వద్దకు తీసుకెళ్లి సరిగా చదివించుకోవాలి. శ్రీనివాస్‌ ఇంో్ల దొరికిన మొత్తంపై ఐిశాఖ ఎక్కడైనా ప్రకించిందా? విజయవాడ, విశాఖపట్నం, కడప, పూనా విం దాదాపు 40 చోట్ల ఐి సోదాలు నిర్వహించామని ఐి డిపార్ట్‌మ్‌ెం పేర్కొంది. ఆంధ్రా, తెలంగాణలోని 3 ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ కంపెనీలపై సోదాలు జరిపాయి. ఈ 3 కంపెనీల్లో జరిగిన సోదాల్లో దొరికన మొత్తం రూ. 2 వేల కోట్లుగా పేర్కొంది. వీిలో దొరికిన డబ్బు రూ. 80 లక్షలు, బంగారం 71 లక్షలు, 25 బ్యాంకు లాకర్లు సీజ్‌ చేశామని చెప్పారు.

కానీ వైసీపీ నేతలు మాత్రం ఆ రూ. 2 వేల కోట్లు చంద్రబాబు మాజీ సీఎస్‌ వద్ద దొరికినట్లు తప్పడు ప్రచారం చేస్తున్నారు. ఐి శాఖ ఈ మొత్తం ీడీపీ నేతల వద్ద దొరికాయని గానీ, చంద్రబాబు మాజీ సీఎస్‌ వద్ద దొరికినట్లు గానీ ఎక్కడైనా చెప్పింది. షాపూర్జీ పల్లాంజీ, మేగా ఇంజనీరింగ్‌, ప్రతిమ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ కంపెనీల్లో రూ. దొరికిన రూ. 2 వేల కోట్లపై సీబీఐ విచారణ అడిగే దమ్ము వైసీపీకి ఉందా? షాపూర్జీ పల్లాంజీ, మేగా ఇంజనీరింగ్‌ కంపెనీలను పశ్రించే దమ్ము ఉందా? మేగా ఇంజీనీరింగ్‌ గురించి గతంలో సాక్షిలో ఏం రాశారో తెలుసు. అదే సాక్షికి మళ్లీ పోలవరం నిర్మాణ భాద్యతలు ఇచ్చారు. ప్రతిమ కంపెనీ కేసీఆర్‌ బినామీదని అందరూ అంారు.వీి గురించి సాక్షి పత్రికలో ఎందుకు రాయటం లేదు.

ఐిశాఖ ప్రకటనలోని ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల పేర్లను వైకాపా నేతలు చెప్పాలి. శ్రీనివాస్‌ ఇంో్ల ఐిదాడులు పంచనామాలు మేం బయటపెడతాం. ఆ 3 ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల పంచనామాలను వైసీపీ నేతలు బయటప్టోలి, లేకపోతే వారి పంచలు ఊడగొడతాం. శ్రీనివాస్‌ దగ్గర దొరికిన డబ్బులకు చంద్రబాబుకు సంబందం ఉందని వైసీపీ అంోంది. వైయస్‌ దగ్గర కెమెరామెన్‌గా పనిచేసిన వంశీ అనే వ్యక్తి గతంలో తన భార్యను హత్య చేసి బెయిలుపై వచ్చి ఇప్పుడు మళ్లీ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే ఆ హత్య వైయస్‌, లేదా జగన్‌ చేయించారా? 38 కేసులు, 13 చార్జ్‌సీట్లు, 43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌, ఆ పార్టీ నాయకులకు టీడీపీని విమర్శించే నైతిక హక్కు లేదని అశోక్‌బాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read