అశోక్ గజపతి రాజుని తిరిగి సింహాచలం చైర్మెన్ గా నియమిస్తూ, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రోజు ఆయన తీర్పు వచ్చిన నేపధ్యంలో, సింహాచలం వెళ్ళారు. దాదాపుగా ఏడాది తరువాత తిరిగి ఆయన దేవుడు దర్శనం చేసుకున్నారు. అయితే ఆలయానికి చైర్మెన్ గా వచ్చినప్పుడు కానీ, వీవీఐపిలు వచ్చినప్పుడు కానీ, పండితులు వచ్చి, తలపాగా చుడతారు. ఇది గౌరవ సుచికంగా ఆలయంలో పాటించే మర్యాదులు. అయితే అశోక్ గజపతి రాజు, చైర్మెన్ హోదాలో తిరిగి ఆలయానికి వచ్చినా, ఎప్పుడూ లభించే గౌరవం ఇప్పుడు ఆయనకు లభించలేదు. అయితే ఈ పరిణామం పై అశోక్ గజపతి రాజు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆలయానికి వచ్చిన ప్రతి సారి, జరిగే సంప్రదాయం ఇప్పుడు ఎందుకు పాటించలేదని, ఇది తమకు చిన్నప్పటి నుంచి లభిస్తున్న గౌరవం అని, ఈ రోజు ఎందుకు ఇలా చేసారు అంటూ, ఆయన అక్కడ అధికారులను నిలదీశారు. అధికారులు వెయ్యద్దు అన్నారో, మరి ఇంకా ఎవరైనా చేయవద్దు అన్నారో కానీ, ఇలా చేయకపోవటం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే క-రో-నా నేపధ్యంలోనే, ఇలా చేయలేదని, మంత్రి ఆదేశాలు ఉన్నాయి అంటూ, అక్కడ ఉన్న వారు చెప్పటంతో, అశోక్ గజపతి రాజు మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు.
అయితే మంత్రి వెల్లంపల్లి మాత్రం, తాను ఏ ఆదేశాలు ఇవ్వలేదని, వాళ్ళు ఎందుకు అలా చేసారో తనకు తెలియదని తప్పించుకున్నారు. అయితే చైర్మెన్ హోదాలో వచ్చినా, ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేయటం గర్హనీయం అని అశోక్ గజపతి రాజు అన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకున్నట్టు చెప్పారు. అయితే ఇక్కడ మరో అంశం ఏమిటి అంటే, ఆలయ అధికారులు అయినా ఈవో, ఏఈవో, ఇలా ఉన్నతాధికారులు ఎవరూ అశోక్ గజపతి రాజు వచ్చిన సందర్భంలో లేరు. చైర్మెన్ గా ఏడాది తరువాత తిరిగి వచ్చినా, ఆయన ఆలయానికి వచ్చినా ఎవరు రాలేదు. ప్రభుత్వం ఈ అంశం పై సుప్రీం కోర్టుకు అపీల్ కు వెళ్ళే ఆలోచనలో ఉండటంతోనే, ఉన్నతాధికారులు ఎవరూ వచ్చి ఉండరని, వస్తే మళ్ళీ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే ఎవరూ వచ్చి ఉండరని అంటున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపధ్యంలో, మళ్ళీ ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని, కోర్టు తీర్పు ప్రకారం అశోక్ గజపతి రాజు చైర్మెన్ గా వచ్చేస్తారని న్యాయ నిపుణులు చెప్తున్నారు.