రాజకీయాల్లో ఎన్నో విమర్శలు చూస్తూ ఉంటాం... చాలా పర్సనల్ గా తిట్టుకుంటారు... విజయసాయి రెడ్డి, జగన్ లాంటి వారి నోటికి ఎలాంటి మాటలు వస్తాయో కూడా తెలీకుండా తిడతారు... ఇవన్నీ ఒకెత్తు అయితే, ఎప్పుడో సంవత్సరాల క్రితం చెప్పిన మాట పట్టుకుని, వారాలు వారాలు అదే మాట చెప్పటం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం... అశోక్ గజపతి రాజు గారు, దాదాపు సంవత్సరం క్రితం, విలేకరులు ఎదో అడగగా "పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలీదు" అన్నారు.. అది కూడా పవన్ కళ్యాణ్ మన రాష్ట్ర ఎంపీలను, మంత్రులను, పార్లమెంట్ లో గోడలు చూడటం తప్ప ఏమి చెయ్యరు అని అంటే, ఆ విషయం విలేకరులు రాజు గారి దగ్గర ప్రస్తావిస్తూ, మీ రియాక్షన్ ఏంటి అంటే, అప్పుడు అన్నారు, పవన్ అంటే ఎవరో నాకు తెలీదు అని...
ఆ వెంటనే దీని పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నేను తెలీదు అంటారా అని ఎదో నాలుగు మాటలు అన్నారు... ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజం... అయితే, సంవత్సరం క్రితం అయిపోయిన విషయం తీసుకువచ్చి, పవన్ కళ్యాణ్, పదే పదే అవే వ్యాఖ్యలు చేస్తూ, హడావిడి చెయ్యటం చూసాం. నెల రోజుల క్రితం, శ్రీకాకుళం, విజయనగం పర్యటనలో, నేను ఎవరో తెలీదు అంటారా అంటూ, "అశోక్ గారూ.. నేను మీ విజయనగరం వచ్చాను.. మీ కోట దగ్గరకు వచ్చాను. నా పేరేనండి పవన్ కల్యాణ్. నన్ను పవన్ కల్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను. మీరు అనుభవించిన కేంద్రం మంత్రి పదవికి కారకుడినండి."అంటూ పీక్స్ కి వెళ్ళిపోయాడు పవన్...
అయితే, అశోక్ గజపతి రాజు గారు, పవన్ ని ఇలా ఎందుకు అన్నారు ? నిజంగానే పవన్ ఎవరో తెలియదా ? పవన్, నిజంగా అశోక్ గజపతి రాజు గారి గెలుపు కోసం పని చేసారా ? నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అశోక్ గజపతి రాజు గారు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. "ఎవరో అడిగారు.. దానికి నేను.. మనిషి నాకు తెలియదన్నాను. ఎన్టీఆర్ సినిమాలే నేను చూడలేదు. ఇంకా ఈయనవరో నాకు ఏమి తెలుస్తుంది. విజయనగరంలో ప్రచారం చేశానని ఆయన చెబుతున్నారు. నేను, ఆయనా కలిసి ప్రచారం చేయలేదు. నాతో కలిసి విజయనగరంలో ప్రచారం చేశానని అతను న్నారు.. అది అబద్ధం" అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారం పై స్పందించారు.