రాష్ట్రంలో ఒక అవినీతి పుటకతో పుట్టిన పత్రిక రాస్తుంది... కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకి, చంద్రబాబుకి తీవ్ర విభేదాలు వచ్చాయని... అదే పత్రికకు తోడు ఉన్న, మరో ఛానల్ కధనం అల్లుతుంది, అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీని వదిలి, బీజేపీ లో చేరి పోతారని.. ఇలా అశోక్ గజపతి రాజు పై అనేక తప్పుడు కధనాలు ప్రసారం చేస్తున్నారు... నిజానికి, ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో, విలువలు ఉన్న నాయకుల లిస్టు తీస్తే, టాప్ 3లో రాజు గారు ఉంటారు... అలాంటి నేత పై తప్పుడు కధనాలు అల్లుతున్నా, వారి మాటలకు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, నేనేంటో చంద్రబాబుకి తెలుసు, ప్రజలకి తెలుసు అని కాంగా ఉన్నారు...
ఇది ఇలా ఉండగానే, శుక్రవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొంతమంది ఎంపీలు కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయిస్తే బాగుంటుందని సూచించారు. పదవులు పట్టుకుని కేంద్రంలో టీడీపీ మంత్రులు వేలాడుతున్నారని, ఇది ప్రజల అభిప్రాయంగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామాలు చేసి బయటకు వచ్చేయాలన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రాజీనామాలు చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఈ క్షణంలో రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఒకవేళ తాము ఢిల్లీలో ఉన్నసమయంలో చంద్రబాబు రాజీనామాలు చేయాలని ఆదేశిస్తే... ఆ మరుక్షణమే ప్రదానికిగానీ, రాష్ఠ్రపతి, లోక్‌సభ స్పీకర్‌కుగానీ రాజీనామా లేఖలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ముందు ఈ పదవులు ఓ లెక్కకాదని అశోక్‌గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో, ఆయన ఒకేసారి అటు ఎంపీలకు, అటు తప్పుడు కధనాలు అల్లుతున్న వారికి, దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు... దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజీనామాలు అనేది ఒక అస్త్రం మాత్రమేనని, అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.