ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నిక గురించి ఆలోచిస్తాడు, పిచ్చి పిచ్చి పధకాలు పెట్టి, ప్రజల బలహీనతలతో ఆడుకుంటూ, వారిని తన బానిసిలుగా చేసుకుంటాడు. అదే ఒక దార్శనికుడు మాత్రం, వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు. వాళ్లకు ఉపాధి వచ్చేలా చేస్తాడు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తాడు. ఇలాంటి దార్శనికులకు ఎన్నికల్లో గెలుపు ఓటముల గురించి ఆలోచన ఉండదు. కేవలం ప్రజల జీవితాలు, వచ్చే తరం గురించి మాత్రమే ఆలోచలు ఉంటాయి. అలాంటి దార్శనికుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సైబరాబాద్ నిర్మాణం తరువాత, ఇప్పటికీ ఆ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు అంటే, అది విజన్. అలాగే నవ్యాంధ్రను కూడా తీర్చి దిద్దే ప్రయత్నం చేసారు చంద్రబాబు. అనంతపురంలో కియా, కర్నూల్ లో సోలార్ పార్క్, చిత్తూరులో మొబైల్ హబ్, విశాఖలో ఐటి, గోదావరి జిల్లాల్లో ఆక్వా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని, ఇలా ఆయన గత 5 ఏళ్ళలో ప్రజలు జీవితాలు మార్చే నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయినా, ఆయన విజన్ మాత్రం ఇప్పటికీ పని చేస్తుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు, పోలీసుడి యూనిఫారం కూడా డ్యూటీ చేస్తుందని, చంద్రబాబు కూడా సియంగా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మంచి కొనసాగుతూనే ఉంది.

ashok 190220211 2

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, 2018 సమయంలో కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ని తీసుకువచ్చారు. వారిని ఒప్పించి మన రాష్ట్రానికి తీసుకురావటమే కాదు, భూమి ఇవ్వటంతో, వెంటనే పనులు కూడా మొదలు పెట్టారు. అయితే నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంట్, నిన్న తమ కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఈ ప్లాంట్ లో అశోక్ లేల్యాండ్ బస్సులు తయారు చేయనుంది. 75 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మాణం జరిగింది. మొత్తం 340 కోట్ల పెట్టుబడి అశోక్ ల్యేల్యాండ్ పెట్టనుంది. ఇక్కడ నుంచి ఏడాదికి 4800 బస్సుల తయారీ జరగనుంది. అలాగే ఇక్కడే ఒక లర్నింగ్ సెంటర్, అలాగే ఒక అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా నెలకొల్పారు. అలాగే ఇక్కడే ఎలక్ట్రిక్ బస్సుల వాహనాలు కూడా తయారు చేయనున్నారు. ఇక్కడ తాయారు చేసిన బస్సులు వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్నాయి. రాష్ట్రంలో యువతకు ఉపాధి మాత్రమే కాదు, రాష్ట్రానికి భారిగా జీఎస్టీ కూడా వచ్చే అవకాసం ఉంది. ఈ రోజు ప్లాంట్ నిర్మాణం కావటంతో, ఇక్కడ ప్లాంట్ నెలకొల్పటానికి ఎంతో కృషి చేసిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుని గుర్తు చేసుకోకుండా ఉండలేం.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read