ఒక నాయకుడు మీద నమ్మకానికి నిదర్శనం ఇది... ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే జరిగేది ఇది... చంద్రబాబు పరిపాలనా సత్తా ఏంటో చెప్పటానికి, మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ మరో ఉదాహరణ... మల్లవల్లి గన్నవరం దగ్గర ఉన్న, మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో 964 ప్లాట్లు ఉండగా, కేటాయింపులకు ముందే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది... ఇక్కడే అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది... మరో పక్క ఇదే ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో, మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థకు ఇంటిగ్రేటెడ్‌ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.. భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనేక స్పి న్నింగ్‌ మిల్లులు, ఫార్మా కంపె నీలు ఆసక్తి చూపి స్తున్నాయి.

ashok leyland 24032018 2

అయితే ఈ భారీ కంపనీల్లో ముందుగా, ప్రముఖ రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్ లేల్యాండ్ అమరావతిలో తమ యూనిట్ నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని పరిధిలో ప్రతిష్టాత్మక పారిశ్రామికవాడగా భావిస్తున్న కృష్ణా జిల్లా మల్లవల్లిలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ స్థాపనకు కార్యాచరణ ప్రారంభించింది. ఈనెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఏపీఐఐసీ వర్గాలకు సీఎంవో, అశోక్ లేల్యాండ్ నుంచి సమాచారం అందింది. ఇప్పటికే అశోక్ లేల్యాండ్ సంస్థకు ఏపీఐఐసీ 15 ఎకరాలు కేటాయించింది. ఎకరం రూ. 16. 50 లక్షల చొప్పున ధర చెల్లించి 15 రోజుల కిందట భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. కేటాయించిన భూమిలో మౌలిక వసతుల కల్పన, నిర్మాణాలకు వీలుగా భూమి చదును చేయిస్తున్నారు.

ashok leyland 24032018 3

చెన్నైకి చెందిన సంస్థ ద్వారా మట్టి సామర్థ్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇక్కడ నెలకొల్పే యూనిట్లో ఏడాదికి 4,800 చొప్పున బస్సు బాడీ బిల్డింగ్ రూపొందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తర్వాత విడతలో ఛాసిస్లు తయారుచేసే యూనిట్ ను నెలకొల్పవచ్చని సమాచారం. అశోక్‌ లేలాండ్‌ సంస్థ ఇక్కడ రూ.135 కోట్ల వ్యయంతో బస్‌బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్థానికంగా 2,295 మందికి ఉపాధిని ఈ సంస్థ కల్పించనుంది... చివరగా, మా ముఖ్యమంత్రి పతనం కోసం ఎదురు చూస్తున్న, ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్ అందరికీ సుస్వాగతం... మా ప్రగతిని కళ్ళారా చూసి, మరిన్ని కుట్రలు పన్నండి.. బెస్ట్ అఫ్ లక్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read