ఈ రోజు ఢిల్లీలో ప్రాధాని మోడీ ఇంటి ముందు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు మెరుపు ధర్నా చేసిన విషయం తెలిసిందే... అయితే, ఈ ధర్నాలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పాల్గునటం చూసి, అందరూ ఆయన కర్తవ్యాన్ని మెచ్చుకుంటున్నారు... మూడు రోజుల క్రితం అశోక్ గజపతి రాజు తల్లి కుసుమ కన్నుమూశారు. గురువారం ఆమె అంత్యక్రియలు జరిగాయి.. అయితే అంత్యక్రియలు జరిగిన ఒక్క రోజులోనే ఢిల్లీ వచ్చి, ఎంపీల ఆందోళనలో పాల్గున్నారు... ఆయన నాలుగో తారీఖు ఢిల్లీ నుంచి వచ్చేశారు.. అయితే, నిన్న చంద్రబాబు ఎంపీలను ఢిల్లీలోనే ఉండమనటంతో, అశోక్ గజపతి రాజు కూడా మళ్ళీ ఢిల్లీ పయనం అయ్యారు...
నిన్న టెలి కాన్ఫరెన్స్ లో, చంద్రబాబు, రాజు గారిని మీరు కష్టాల్లో ఉన్నారు ఢిల్లీ వెళ్ళవద్దు, అని చెప్పినా, ఆయన మాత్రం వినిపించోకోలేదు... మన ఎంపీలు అందరూ కలిసి కట్టుగా ఉండి, ఎక్కువ మంది కనిపిస్తే, మన ఆందోళన ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి, ఢిల్లీ బయలుదేరి వచ్చారు.. ఈ రోజు ఉదయం, ఎంపీ సుజనా చౌదరి నివాసంలో టీడీపీ ఎంపీల సమావేశంలో పాల్గున్నారు... ఈ సమావేశం అనంతరం టీడీపీ ఎంపీలు ప్రధాని నివాసానికి బయల్దేరారు. ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలని వారు నిర్ణయించారు. ప్రత్యేక హోదా కోసం మోదీ ఇంటి ఎదుట నిరసనకు దిగారు. దీంతో ప్రధాని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు...
అయితే పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు... పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. భద్రతా బలగాలు ఎంపీలను బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకుని బస్సులో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, ఎంపీలకు స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది... అదుపులోకి తీసుకున్న ఎంపీలను పోలీసులు తుగ్లక్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ప్రధాని నివాసానికి తీసుకెళ్తే తప్ప తాము బస్సు దిగేది లేదని ఎంపీలు భీష్మించుకుని కూర్చున్నారు.తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే బలవంతంగా తరలించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఎంపీలు అన్నారు. ఈ చర్యతో మోదీ నిరంకుశతత్వం బయటపడిందన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో రోజుల తరబడి గొంతు చించుకున్నా కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ..