జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అశోక్ గజపతి రాజు పై తన కక్ష పూరిత వైఖరి చూపిస్తూ, సంచలన నిర్ణయం తీసుకుంది. రామతీర్ధంలో రాములోరి తల పెకలించిన ఘటన పై సీరియస్ అయిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసింది. ఇందు కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. ఆయనే రామతీర్ధం వచ్చి, జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజు కూడా, ఆయన వెంటే పర్యటనలో ఉన్నారు. అయితే ఈ రోజు అశోక గజపతి రాజు ఇంకా నిరసన కార్యక్రమంలో కొనసాగుతూ ఉండగానే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, షాకింగ్ నిర్ణయం తీసుకుని. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా అశోక్ గజపతి రాజు రామతీర్ధం గుడికి ట్రస్ట్ చైర్మెన్ గా ఉన్నారు. అయితే ఈ క్షణం నుంచి ఆయన్ను తప్పిస్తూ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రామతీర్ధం ఘటన జరిగి, ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేయటం, ఇందు కోసం అశోక్ గజపతి రాజు ముందు ఉండి ఈ ఆందోళన చేయటం, చంద్రబాబుని పిలిపించటంతో, అశోక్ పై కక్షతో ఇలా చేసారా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది.
రామతీర్థం, పైడితల్లి, మందపల్లి ఆలయ ట్రస్ట్ ల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఒక మేమో ని విడుదల చేసింది. అయితే దీనికి కారణాలు చెప్తూ, ఆలయంలో అడ్మినిస్ట్రేషన్ మైంటైన్ చేయటంలో ఆయన ఫెయిల్ అయ్యారు అంటూ కారణం చెప్పారు. అయితే చంద్రబాబు సభలో ప్రసంగిస్తూ ఉండగానే, చంద్రబాబుకి ఈ విషయం చెప్పారు అచ్చెంనాయుడు. దీంతో ఇదే విషయం చంద్రబాబు కూడా మీటింగ్ లో చెప్పారు. మనం ప్రనిస్తున్నాం అని ఇప్పటికిప్పుడు తొలగించారని, సింహాచలం నుంచి, మాన్సాస్ నుంచే తప్పించారు, ఇదేముంది, మీకు చేతనైంది ఇదే అంటూ, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి చర్యలతో జగన్ వైఖరి మరోసారి తేటతెల్లం అయ్యిందని అన్నారు. ఇప్పటి వరకు ఘటన ఎవరు చేసారు, ఎలా చేసారో, తేల్చలేకపోయారని, అకారణంగా అశోక్ గజపతి రాజు గారి ని మళ్ళీ ఇప్పుడు పదవి నుంచి తొలగించారని, దీంతో ఆయనకు పోయేది ఏమి లేదని, ఇలాంటివి చేయటం తప్ప , జగన్ రెడ్డి ఎందుకు పానికిరాడని చంద్రబాబు అన్నారు.