సొంత ఆస్తులు త్యాగం చేసి, రాజకీయాలు చేస్తున్న ఘనమైన చరిత్ర కలిగిన నాయకుడు ఒక పక్క... పేదలను పీల్చి, పిప్పి చేసి, హత్యా రాజకీయాలు చేసి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించి, 11 కేసుల్లో A1గా ఉంటూ, 16 నెలలు జైలు జీవితం గడిపి, బెయిల్ పై బయట తిరుగుతున్న వాడు ఒక పక్క... ఇంత ఘనమైన అవినీతి చరిత్ర కలిగిన వాడు, అశోక్ గజపతి లాంటి నిజాయితీ పరుడుని, భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్ల విషయంలో అవినీతి జరిపారు అంటూ, ఆయన పైనే ఆరోపనులు చేస్తూ, బురద జల్లి, కడుక్కోమంటున్నాడు... దీని పై అశోక్ గజపతి రాజు స్పందించారు...
భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తానే సూచించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు ఆదాయం, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని... ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు అంత శక్తి లేదని వివరించారు... ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అశోక్‌గజపతిరాజు అన్నారు... ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు, భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు అప్పిగిస్తే, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది..
దీని పై వైసిపీ నాయకులు, జగన్ గత కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్నారు... టెండర్ రద్దు అయినా హడావిడి ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదు... టెండర్లు రద్దు అవటం అనేది పాలన పరంగా, జరిగే అతి సాధారణ ప్రక్రియ... అయినా, ఎక్కడైనా టెండర్ ఇస్తే రాద్దాంతం చేస్తారు కాని, ఇక్కడ టెండర్ రద్దు చేస్తే కూడా రాద్దాంతం చేస్తున్నారు... అయినా టెండర్లో ఎవరైనా పాల్గునవచ్చు... అన్నీ నిబంధనలు ప్రకారం జరుగుతాయి.. ఎవరైనా ఎక్కడైనా తేడా అనిపిస్తే కోర్ట్ కి వెళ్ళవచ్చు... ఇన్ని ఆరోపణలు చేసే బదులు, కోర్ట్ కి వెళ్లి, కోర్ట్ చేతే ఇది తప్పు అని జగన్ ఒక్క విషయంలో అయినా ప్రూవ్ చేసాడా ?