ఇప్పుడు ఎవరి నోట విన్నా రిసార్ట్ దీక్ష గురించే... ఎన్నో దీక్షలు గురించి విన్న ప్రజలు నిన్న పవన్ కళ్యాణ్ చేసిన రిసార్ట్ దీక్ష గురించి తెలుసుకుని అవాక్కయ్యారు... పవన్ దీక్ష చేస్తున్న విధానం పై చర్చ వచ్చింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి, రేపు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ రిసార్ట్ లోనే దీక్ష చేసారు. దీక్ష అంటే, జనాల మధ్య ఉంటుంది కదా అనుకున్నారు... కాని, ఎవరికీ ఎంట్రీ లేదు.. కనీసం మీడియాకు కూడా... మీడియా అదేమిటి అని అడిగితే, మేమే వీడియో తీసి కొన్ని బైట్స్ పంపిస్తాము అని చెప్పారు.. ఇక్కడ అయిన తరువాత, ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ హాఫ్ మాత్రం ప్రజల మధ్యలో దీక్ష మొదలు పెట్టారు.. నిన్న చీకట పడగానే పవన్ రిసార్ట్ లోపలకి వెళ్ళిపోయి దీక్ష చేసారని జనసేన వర్గాలు చెప్పాయి..
అయితే ఇదేమి దీక్షో అంటూ ప్రజలు అవాక్కయ్యారు. ఇదే విషయం పై, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు స్పందిచారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఆసుపత్రిలో దీక్ష చేయాలి కానీ, రిసార్ట్ లో కాదని, తొలిసారిగా రిసార్ట్ లో దీక్ష చేయడం చూస్తున్నానని, ఇది కొత్త ఫ్యాషనేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు రిసార్ట్ లో దీక్ష ఏమిటో అర్ధం కావటం లేదని, ఇలాంటి దీక్షలు ఇప్పుడే చూస్తున్నాని అని అన్నారు... ప్రభుత్వం ఉద్దానం పై తీసుకున్న చర్యలు వివరించారు... మరో పక్క చంద్రబాబు కూడా ఈ విషయం పై ఈ రోజు సమీక్ష చేసారు... ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... కిడ్నీ రోగులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు.
13 వేల మందికి క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నామని, ప్రతి 15రోజులకు నెఫ్రాలజిస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పలాస, సోంపేట, పాలకొండ, టెక్కలిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేశామని, రూ.17కోట్లతో 7 ఆర్వో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అంతేగాక సీకేడీ కేసుల కోసం సోంపేటలో ప్రయోగశాల ఏర్పాటు చేశామని, పనిచేసేవాళ్లపైనే విమర్శలు చేస్తారా? అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. నెగటివ్ ధోరణులు అభివృద్ధికి నష్టం చేస్తాయన్నారు.