మన అమరావతి - మన రాజధాని అంటూ, ప్రజల అందరినీ అమరావతితో కనెక్ట్ అవ్వటం కోసం, ఆ రోజు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేసారు. 10 రూపాయలకే ఇటుకు అంటూ, ప్రతి సామాన్యుడు ఇది నా రాజధాని అని అనుకునే విధంగా, చంద్రబాబు ప్రయత్నాలు చేసారు. దీంతో ప్రతి ఒక్క ఆంధ్రుడు, అమరావతితో అనుబంధం పెంచుకున్నారు. దేశం కాదు, ప్రపంచ గర్వించే రాజధాని మేము కట్టుకుంటున్నాం అంటూ ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు ఆంధ్రుడు. కాని ప్రజలు తీర్పు మాత్రం ఎన్నికల్లో వేరే విధంగా ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని అందలం ఎక్కించారు. అప్పటి నుంచి అమరావతి పరిస్థితి ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, మా పరిస్థితి ఏంటి అంటూ జగన్ వైపు చూడాల్సిన పరిస్థితి.
నిత్యం వేల మంది కార్మికులతో హడావిడిగా ఉన్న అమరావతి ప్రాంతం, ఈ రోజు ఒక్కరు కూడా అక్కడ లేక, బోసిపోయింది. అన్ని కట్టడాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డికి, అసలు అమరావతి అంటే ఇంట్రెస్ట్ లేదని తేలిపోయింది. అయితే అమరావతి పై ఇంకా కొంత మందికి ఆశలు ఉన్నాయి. దానికి కారణం, ప్రపంచ బ్యాంక్, మిగతా బ్యాంక్ లు ఇస్తాం అంటున్న లోన్లు. నాలుగు రోజుల క్రిందట ప్రపంచ బ్యాంక్ మేము లోన్ ఇవ్వం అని చెప్పింది. దానికి కారణం కేంద్రం, ఇచ్చిన ప్రతిపాదన వెనక్కు తీసుకోవటం. ఎందుకు కేంద్రం తీసుకుంది అంటే, రాష్ట్రానికే ఇంట్రెస్ట్ లేకపోతే మేము ఏమి చెయ్యం అంటూ కేంద్రం కూడా వదిలించుకుంది. దీంతో ప్రపంచ బ్యాంక్ ఇవ్వాలి అనుకున్న లోన్ వెనక్కు వెళ్ళిపోయింది.
ఇప్పుడు తాజగా మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు లోన్ ఇవ్వం అంటూ మరో కీలక బ్యాంకు చెప్పేసింది. అమరావతికి లోన్ ఇవ్వం అంటూ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్(ఏఐఐబీ) అమరావతి స్పష్టం చేసింది. చంద్రబాబు హయంలోనే, అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం మారటంతో, అమరావతి పై జగన్ ప్రభుత్వ వైఖరి చూశాక, ప్రపంచ బ్యాంకే వెనక్కు వెళ్ళిపోతే, మనకు ఎందుకు అంటూ రుణం ఇవ్వకపోవడమే మంచిదని ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. అమరావతికి ఒక్కో షాక్ తగులుతూ ఉండటం, అలాగే జగన్ కు అమరావతి అంటే ఇష్టం లేకపోవటంతో, ఇక అమరావతి అనే రాజధాని గురించి ఏపి ప్రజలు మర్చిపోవటమేనా ?