ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో అడుగుపడింది. అందరూ కియా ఫస్ట్ కార్ మీద ఫోకస్ చేసిన వేళ, రాష్ట్రంలో మరో టాప్ కంపెనీ వైజాగ్ లో ఉత్పత్తి ప్రారంభించింది... ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్, మోటార్స్ రంగంలో పలు జిల్లాలలో ఉత్పత్తి ప్రారంభంకాగా ఇప్పుడు విశాఖలో మరో సంస్థ నుండి ఉత్పత్తి ప్రారంభమైంది. పెయింట్ల తయారీలో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఏషియన్ పెయింట్స్ తన విశాఖపట్నం ప్లాంట్ లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 25కి పైగా ఉన్న ఏషియన్ ప్లాంట్లలో ఇది అత్యాధునికమైన అతిపెద్ద ప్లాంట్ కావడం విశేషం కాగా మార్చి 10, 2015లో కుదిరిన ఎంఓయు ప్రకారం ఏషియన్ పెయింట్స్ 1,750 కోట్ల వ్యయంతో ఉత్పత్తి యూనిట్ ను ఏర్పాటు చేసింది.

paintas 29012019

పూడి గ్రామంలో 110 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఏషియన్ పెయింట్స్ ప్లాంట్ ద్వారా ఇప్పటికే 700 మందికి ఉద్యోగాలు రాగా ఏడాదికి 5 లక్షల కిలోలీటర్ల పెయింట్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం కాగా దశలవారీగా ఏర్పాటయ్యే ప్లాంట్ లో ఇప్పుడు ఏడాదికి 3 లక్షల కిలోలీటర్లు ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అదనంగా 11 లక్షల కిలో లీటర్ల కలర్స్‌ను ఉత్పత్తి చేయడానికి రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. వీటిలో రూ.1,785 కోట్లతో ఏడాదికి 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను వైజాగ్‌లోనూ, రూ.2,300 కోట్లతో 6 లక్షల కెపాసిటీ కలిగిన యూనిట్‌ను మైసూరులో నెలకొల్పారు.

paintas 29012019

అయితే ముందుగా విశాఖ ప్లాంట్ రెడీ అయ్యింది. అయితే తొలి దశలో ఈ రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం మూడు లక్షల కిలో లీటర్లు మాత్రమే. కరెన్సీ మారకం సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ మార్కెట్లు పెద్దగా కలిసి రాలేదని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఈ రెండు సమస్యలతో ఈజిప్టు, ఇథోపియా, శ్రీలంక దేశాల్లో సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిపింది. పెద్దగా అమ్మకాలు లేకపోవడంతో కరేబియన్‌ దేశాల మార్కెట్‌ నుంచి కంపెనీ పూర్తిగా తప్పుకుంది. దేశీయ కలర్స్ రంగంలో దూసుకుపోతున్న ఈ సంస్థ..16 దేశాల్లో 25 ప్లాంట్లను ఏర్పాటు చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read