అథెనా ఇన్ఫ్రా... ఈ సంస్థ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంబకోణం కేసులో పట్టుబడిన ఒక కంపెనీ... అయితే, ఈ అథెనా ఇన్ఫ్రా కంపెనీ పుట్టుక వెనుక చాలా మతలబు ఉన్నట్టు, సిబిఐ అప్పట్లోనే గుర్తించింది... దీని వెనుక అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక మేళ్ళు జరిగాయి అనే ప్రచారం ఉంది... జగన్ మోహన్ రెడ్డి ఈ కంపెనీ వెనుక ఉన్నారు అనే వార్తాలు కూడా వచ్చయి... సిక్కింలో జరిగిన పవర్ స్కాంలో కూడా ఈ కంపెనీ ఉంది... వైఎస్ సోదరుడు, వైయస్ రవీంద్రా రెడ్డితో పాటు, వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ లుగా ఉండి బయటకు వచ్చారు... తరువాత నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు.. తరువాత ఆయన బయటకు వచ్చారు... అథెనా ఇన్ఫ్రా సంస్థకు, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ అనేది అనుబంధ సంస్థ... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్, శ్రీకాకుళంలో, కాకరాపల్లి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చెయ్యటానికి 2450 ఎకారాలు ఇచ్చారు... ఇక్కడ పవర్ ప్లాంట్ వద్దు అని ఎంత చెప్పినా వినలేదు...
అయితే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ పై స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది... స్టేట్ బ్యాంకుకు 952 కోట్ల అప్పులు, పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ కు 1407 కోట్ల అప్పులు ఉన్నాయని, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ బకాయలు తీర్చటం లేదు అని, అందుకే ఆ సంస్థను పై దివాలా ప్రక్రియ చేపట్టాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసాయి. ఈ సంస్థ దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ ఈ నెల 4న దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ దరఖాస్తులను విచారణకు స్వీకరించే అంశం పై ట్రిబ్యునల్ విచారణ చేస్తుంది... ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ తీసుకున్న రుణాల పై కూడా ఎథెనా కంపెనీ హమీదారుగా ఉంది...
పారిశ్రామిక రంగంలో ప్రగతి పథంలో సాగుతున్న మ్యాట్రిక్స్ నిమ్మగడ్డ ప్రసాద్, కార్వీ సంస్థ శివరామకృష్ణ, మరో సంస్థకు చెందిన తాతినేని వెంకటకృష్ణలను వైయస్ రాజశేఖర రెడ్డి చేరదీసి వారి ద్వారా కథంతా నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం ప్రజలు జగన్ ను కూడా నిలదీశారు... జగన్ 2014 ఎన్నికల ప్రచారంలో శ్రీకాకుళం వచ్చినప్పుడు, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ లో అనిల్ కుమార్‌కు వాటాలున్నాయనే విషయంపై వారు జగన్‌ను ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టుకు అనుమతిచ్చిన విషయంపై కూడా వారు అడిగారు. రోజు నీతులు చెప్పే సాక్షిలో ఇలాంటి వార్తలు రావు, ఎందుకంటే ఇది జగన్ కు సంబంధించిన కంపెనీ కాబట్టి...