ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ చూస్తున్నాం. దేశంలోనే రైతులు ఆ-త్మ-హ-త్య-ల్లో మనం మూడో స్థానంలో ఉన్నాం. ఒక పక్క ప్రకృతి విపత్తులు, మరో పక్క పాలకుల అశ్రద్ధ. గిట్టుబాటు ధరలు ఉండవు, మార్కెటింగ్ సౌకర్యం ఉండదు, విపత్తుల పరిహారం ఉండదు, చివరకు ధాన్యం అమ్మితే, చెరకు అమ్మితే కూడా బకాయలు కోసం రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. పరిస్థితి ఇలా ఉంటే, ప్రభుత్వం మాత్రం, తామది రైతు ప్రభుత్వం అని చెప్తుంది. రైతు ఉత్సవాలు చేస్తుంది. మేము రైతులకు ఇచ్చే సంక్షేమం ఇంకా ఎవరూ ఇవ్వటం లేదని చెప్తుంది. తన తండ్రి పుట్టిన రోజుని, రైతు దినోత్సవం అని ప్రకటించారు. ఇలా ప్రభుత్వం ఇంత డబ్బా కొడుతుంటే, అసలు రైతులు పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది ? ఏమి జరుగుతుంది అనే విషయాల పై ఆత్మసాక్షి అనే సంస్థ ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో సంచలన విషయాలు అన్నీ బయట పడ్డాయి. దాదపుగా 30 వేల మంది రైతుల నుంచి ఈ సర్వే సాంపుల్స్ తీసుకున్నారు. మొత్తం 12 ప్రశ్నలు అడిగారు. మొత్తంగా కేవలం 44.5 శాతం మంది రైతులు మాత్రమే సంతృప్తి వ్యక్తం చేసారు. ముఖ్యంగా విద్యుత్ మోటార్లకే మీటర్ల వ్యవహారం పై, ఎక్కువ శాతం మంది రైతులు వ్యతిరేకించారు. ఇప్పటికే కొన్ని చోట్ల మీటర్లు పెడుతున్న సంగతి తెలిసిందే.
ఇక ప్రభుత్వం పూర్తిగా నిర్ల్యక్షం చేసిన పంట కాలువల నిర్వహణపై కూడా ఆగ్రహంగా ఉన్నారు. కూలీలకు ఎక్కువ ఖర్చు అవుతుందని వాపోయారు. అలాగే కనీస మద్దతు ధర రావటం లేదని, తమ దగ్గర కొన్న పంట విషయంలో, ప్రభుత్వం వెంటనే డబ్బులు ఇవ్వటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక కౌలు రైతులు పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని సర్వేలో తేలింది. ఇలా అనేక అంశాల పై ప్రభుత్వం పై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. చాలా కొన్ని అంశాల్లో మత్రమే, 50 శాతం పైగా సంతృప్తితో రైతులు ఉన్నారు. ఆత్మ సాక్షి సర్వే అనేది కొంత వైసీపీకి అనుకూలంగా ఉంటుంది అనే ప్రచారం ఉంది. ఆ సర్వేలోనే ఇంత వ్యతిరేకత ఉంది అంటే, వాస్తవంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఇది ఇలా ఉంటే, ఈ సర్వే వివరాలు గురించి తెలుసుకున్న ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. వెంటనే ఈ సర్వే పూర్తి వివరాలు ఇవ్వాలని, ఆ వివరాలు అన్నీ తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. మరి ప్రభుత్వం, ఇప్పటికైనా రైతుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.