వైసీపీ నేతల ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినా, ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంటారు. తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే పోలీసులకు అనేక ఫిర్యాదులు చేసారు టిడిపి నేతలు. అయినా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కాంట్రాక్టర్ ల పై కూడా దాడులు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ క్యాంపు కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడికి చేసి, భయబ్రాంతులకు గురి చేసారు. ఆత్మకూరు మండలం కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్సార్ కన్ స్ట్రక్షన్ క్యాంపు కార్యాలయంపై దాడికి దిగాయి వైసీపీ శ్రేణులు. అక్కడ ఉన్న వాహనాలు, టిప్పర్ల అద్దాలు పగులగొట్టి భయబ్రాంతులకు గురి చేసారు. అక్కడ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న సామగ్రి ధ్వంసం చేశారు.

atp 01092019 2

ఈ దాడి చేసింది, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు. ఎన్నికల ఫలితాల అనంతరం రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ ఎస్ఆర్ కాంట్రాక్టర్ ఎస్ఆర్ కన్స్ట్రాక్షన్ ను హుకుం జారీ చేసారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు. నేషనల్ హైవే అధికారుల వత్తిడితో మళ్ళీ పనులను మొదలు పెట్టారు ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సిబ్బంది. దీంతో మాకు చెప్పకుండా, ఎందుకు పనులు చేస్తున్నారు అంటూ, అక్కడ పనులు చేస్తున్న వర్కర్ల పై దాడి చేసారు. ఐదు మందికి గాయాలు అయ్యాయి. రోడ్డు పనులు చేస్తున్న యంత్రాలను ఆపి తాళాలు లాక్కున్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఈ ఘటనపై ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరిగెత్తారు.

atp 01092019 3

అయితే వైసిపీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఇలాంటి అరాచకాలు ఎన్నో జరిగాయి. కర్నూల్ సోలార్ పార్క్ విషయంలో కూడా ఇలాగే బెదిరించారు. తరువాత కొన్ని రోజులకు సోలార్ ప్యానెల్స్ పగలగొట్టారు. అలాగే కియా కంపెనీ పై, అందరూ చూస్తూ ఉండగానే అక్కడ ఎంపీ బెదిరించిన సంగతి చూసాం. ఇప్పుడు ఈ వార్త వింటున్నాం. ఇలా కంపెనీలను బెదిరిస్తే, పెట్టుబడులు ఎలా వస్తాయి ? ఒక కంపెనీ మన దగ్గర పని చేస్తే, నాలుగు ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది ఒక కంపెనీ మన దగ్గరకు రావాలి అంటే, ఎంతో కష్టపడితే కాని రాడు. అలా వచ్చిన కంపెనీలను, ఇలా బెదిరించి వెళ్ళగోడితే, తరువాత ఎవరూ కొత్తగా పెట్టుబడులకు రారు. ఉన్న కంపెనీలు పోయి, కొత్తవి రాక, రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఏ రాజకీయ నాయకుడు అయినా, ఇలా రాష్ట్రానికి నష్టం అయ్యే పనులు మాత్రం చెయ్యకూడదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read