వైసీపీ విజయంతో ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి. కొన్నిచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. అనంతపురంలో వైసీపీ నాయకులు టీడీపీ వర్గీయుల ఇంటిపై దాడిచేశారు. కుర్చీలు, తలుపులపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. బాధితులు తెలిపిన వివరా ల మేరకు... నగరంలోని కృపానందనగర్‌లో డిప్యూటి మేయర్ సాకే గంపన్న సోదరుడి కు మారుడు సాకే చంద్రమోహన్ ఇంటిపై వైసీపీకి చెందిన చంద్రశేఖర్, సురేంద్ర, తిక్కసా యి, చిట్టి, వడ్డే నవీన్ శుక్రవారం రాత్రి తా గిన మత్తులో దాడికి దిగారు. దీంతో ఇరువురిమధ్య వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. వైసీపీ నాయకులు రాళ్లతో ఇంటి ముందున్న కుర్చీలను, సరుకులను, ఇంట్లోని కూలర్, ఫ్రిజ్‌ను ధ్వంసం చేసి దాడికి దిగారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకులు ఇంటిపైకొచ్చి దాడిచేయడంతోపాటు తమపై అసభ్య పదజాలంతో దూషించారని బాధితు లు ఆవేదన వ్యక్తంచేశారు. ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక అనంతపురం నగరంలోని వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న ఇద్దరిపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని విద్యుత్‌నగర్ సర్కిల్‌లో లోకేష్, సాయిక ల్యాణ్ అనే అన్నదమ్ములిద్దరూ వస్త్రదుకాణం నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన సాకే చంద్రశేఖర్, సురేంద్రనాథ్‌రెడ్డి, గుజ్జల గంగాధర్, నగేష్, మధు, నరేంద్ర అనే వైసీపీ కి చెందిన యువకులు వస్త్రదుకాణంపై శుక్రవారం దాడికి దిగారు. వారందరూ అన్నదమ్ములిద్దరిపై ఇష్టారాజ్యంగా మాటలతో దూ షించడంతోపాటు మూగదెబ్బలు తగిలేలా చితకబాదారు. ‘మా ప్రభుత్వమొచ్చింది. మీకు దిక్కున్నచోటు చెప్పుకోండి’ అంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రొళ్ల మండలంలోని రొళ్ల గొల్లహట్టి టీడీపీ కార్యకర్త గద్దెతిమ్మప్పకు చెందిన అవిస చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. ఆరెకరాలో వక్కచెట్లు అంతరపంటగా అవిసచెట్లను సాగుచేశాడు. వక్క చెట్లకు నీడగానూ, గొర్రె పిల్లల మేత కోసం ఎంతో ఉపయోగపడే ఈ చెట్ల నరికి వేయడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని బా ధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫ లితాలు విడుదల కాగానే తమకు గిట్టని వా రు ఈ పనిచేసి ఉంటారని వాపోయారు. ఈ విషయమై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేయనున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇక బ్రహ్మసముద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి గురువారం రాత్రి దుండగులు నిప్పంటించారు. కనగానపల్లిలో పలు గ్రామాలలో టీడీపీ, వైసీపీ వర్గాల మ ధ్య ఘర్షణ చోటు చేసుకుని ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఇలా అనేక చోట్ల, వైసీపీ నాయకులు, టిడిపి కార్యకర్తలని హింసకు గురి చేస్తున్నారు.