ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్ట్స్ మరియు కామర్స్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా డాక్టర్ పేటేటి ప్రేమానందం పై, కుల వివక్ష చూపించారు అంటూ, ఆరోపణలు వస్తున్నాయి. ఖర్చు పెట్టిన నిధులు విషయంలో, ఆయనకు నిధులు విడుదల చెయ్యటానికి, సంతకం చేయడానికి ఆచార్య పేటేటి ప్రేమానందం గారిని ఏడు రోజులు కాళ్ళు అరిగేలా చేయడమేగాక, ఇన్ని సార్లు ఎందుకు తిప్పారు అని అడిగినందుకు, గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ యూజ్ లెస్ ఫెలో అంటూ, దారుణంగా అవమానించి యూనివర్సిటీ లో దారుణ అవమానానికి గురిచేయడమే గాక యూనివర్సిటీ లో ఆర్ట్స్ మరియు కామర్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్ గానూ , ఆంద్రాయూనివర్శిటీ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గా ,ఆంద్రాయూనివర్శిటీ ఫ్యాకల్టీ క్లబ్ ప్రధాన కార్యదర్శి గా అనేక హోదా లలో కొనసాగుతున్న ఆచార్యున్ని ఒక నాన్ టీచింగ్ ఉద్యోగితో బయటకు పంపించి దారుణంగా ఘోరమైన అవమానానికి , మానసికమైన అశాంతికి గురిచేసారు అంటూ నిన్న ఆరోపణలు వచ్చాయి. డాక్టర్ పేటేటి ప్రేమానందం కూడా, ఈ విషయం పై, నిన్న మీడియాతో మాట్లాడుతూ, తన ఆవేదన చెప్పుకున్నారు.

ఇదే అంశం పై, తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి, కేఎస్ జవహర్ స్పందించారు. " జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది బీహార్ లా తయారైంది. మరీముఖ్యంగా దళిత హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్, మాజీ ఎంపీ, మాజీ మంత్రులపై జరుగుతున్న వరుస దాడులే ఇందుకు నిదర్శనం. ప్రొ. ప్రేమానందం విషయంలో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సాటి ఉద్యోగిని గౌరవించలేని వ్యక్తులు సమాజాన్ని ఏం గౌరవిస్తారు..? అటువంటి వారిపై చర్యలు తీసుకోకపోగా.. వైకాపా ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటు. రాజకీయాలతో సంబంధం లేని ప్రొఫెసర్ ప్రేమానందం ఇచ్చిన కేసును పరిగణలోకి తీసుకోని అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయలేదు..? వీసీ, రిజిస్ట్రార్ లపై ఎందుకు చర్యలకు వెనుకాడుతున్నారు..?"

"ఆత్మకూరులో దళితులను గ్రామ బహిష్కరణ చేసిన నాటి నుంచి నేటి వరకు దళితులపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా వివక్ష చూపుతూనే ఉంది. ఎల్జీ పాలీమర్స్ దుర్ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందించిన ప్రభుత్వం.. విద్యుదాఘాతంతో చనిపోయిన దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు మాత్రమే పరిహారం ప్రకటించడం వివక్ష కాదా..? చివరకు లిడ్ క్యాప్ భూములను కూడా అన్యాక్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. దళితులపై సవతి తల్లి ప్రేమ చూపుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆంధ్రా యూనివర్శిటీ వేదికగా దళిత సంఘాలన్నీ ఏకం కాబోతున్నాయి. ఇప్పటికైనా దళితులపై ప్రభుత్వ వైఖరి ఏమిటో.. ముఖ్యమంత్రి, దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ప్రొ.ప్రేమానందం గారి విషయంలో తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేసి.. ఆయనను కించపరిచేలా వ్యవహరించిన రిజిస్ట్రార్ ను అరెస్ట్ చేయాలి, వీసీని సస్పెండ్ చేయాలి. " అంటూ జవహర్ స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read