రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి మధ్యాహ్నా భోజన పథకం అమలు కానుంది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్‌దాస్‌ బుధవారం విడుదల చేశారు. ఈ పథకానికి రూ.56.53కోట్లు రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఆహారం వండేందు కు రూ.23.75కోట్లు, కోడిగుడ్ల సరఫరా కోసం రూ.13.08కోట్లు, వంట వారికి, హెల్పర్లకు పది నెలలకు కలిపి రూ.1.90కోట్లు, రవాణ ఖర్చుల కింద రూ.17.80కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 450 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 1,74,683 విద్యార్థులకు ఈ పథకం అమలు కానుంది.

inter 27072018 2

331 జూనియర్‌ కళాశాలలకు వాటికి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలల నుంచి ఆహారం అందించడం జరుగుతుంది. మిగిలిన 119 కళాశాలలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశా లల నుంచి అందిస్తారు. ఈ బాధ్యతలను కూడా కేంద్రీయ వంట శాలలు, ఎన్జీవోలకు ప్రభుత్వం అప్పగించనుంది. ఇప్పటివరకూ 1 నుంచి 10వ తరగతి వరకే మధ్యాహ్న భోజనాన్ని సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యాన అమలు చేస్తున్నారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ వారికీ..దీన్ని విస్తరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సర బడ్జెటును రూ.23 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఒక్క కృష్ణాజిల్లాలోనే 25 ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల నుంచి 15వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేయాలని, పేద, మధ్య తరగతి విద్యార్థులను ఆదుకోవాలనే లక్ష్యంతో..మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

inter 27072018 3

దీనివల్ల ఇంటర్ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఏపీలో మధ్యాహ్న భోజన పథకాన్ని 1982 నుంచి అమలు చేస్తున్నారు. 2003 నుంచి దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం(1-5 తరగతులు) ప్రారంభించారు. 2008లో 6 నుంచి 8 తరగతులకు, ఆ తర్వాత 9, 10 తరగతులకు దీన్ని విస్తరించారు. 2010-11 నుంచి ప్రత్యేక స్కూళ్ల విద్యారులకూ అమలు చేస్తున్నారు. 2012-13 నుంచి 220 పని దినాల్లోనూ విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు. విద్యార్థులు బడికి సక్రమంగా రావడం, హాజరుశాతం పెంపుదల, బాలబాలికలకు పౌష్టికాహారం అందించాలనేదీ.. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ప్రాథమిక, మాథ్యమిక విద్యార్థులకు సోమవారం-కోడిగుడ్డు, సాంబారు, మంగళవారం-కూరగాయలు, బుధవారం - పప్పు, కూరగాయలు, కోడి గుడ్డు, గురువారం-సాంబారు, శుక్రవారం-కూరగాయాలు, కోడిగుడ్డు, శనివారం-పప్పు, కూరగాయలతో భోజనాన్ని వడిస్తున్నారు. ఇదే మేనునూ కొంచెం మార్పులతో ఇంటర్ విద్యార్థులకూ అమలు చేస్తారని తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read