ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒకబందిపోటులా మారిపోయాడని, రాష్ట్రంలోని సంపదనంతా బందిపోటులా దోచుకుంటున్నాడు కాబట్టే, అలా అనాల్సివస్తోందని, ప్రజలు ఏమనుకుంటారోననే విషయాలను పూర్తిగా పక్కనపెట్టేసిన సీఎం, తనఅనుచరులతో కలిసి బందిపోట్ల ముఠా నాయకుడిగా తయారయ్యాడు కాబట్టే, అలా అంటున్నానని టీడీపీజాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే క్లుప్తంగా మీకోసం... జగన్మోహన్ రెడ్డి బందిపోటుముఠాలో కీలకసభ్యుడి కంపెనీ అయిన అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎవరిదో అందరికీ బాగాతెలుసు. విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన కంపెనీ. జగన్ ఆత్మ అయిన విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీఅది. ఒకరకంగా దాన్ని జగన్ రెడ్డి సొంత కంపెనీగానే భావించాలి. గతంలో సీబీఐ, ఈడీ కేసుల్లోకూడా అరబిందోపాత్రని మనం చూశాము. అటువంటి కంపెనీకి నేడు రాష్ట్రంలోనిసంపదని దోచిపెడుతున్నారు. మరీముఖ్యం గా పోర్టులను, రాష్ట్రంలోని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అత్యంతకీలకమైన సీ-పోర్టులేవైతే ఉన్నాయో వాటిని ఒకదాని తర్వాత ఒకటి కబ్జాచేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ బందిపోటు ముఖ్యమంత్రి. కాకినాడలోని కేఎస్పీఎల్ (కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్), కేజీపీఎల్ (కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్) లు కాకినాడ సెజ్ లో భాగంగా ఉన్నాయి. ఆ రెండింటినీకూడా పూర్తిగా తనబినామీ, తనబందిపోటు ముఠాలోని కీలకసభ్యుడైన వ్యక్తికిచెందిన కంపెనీ అరబిందోకి ధారాధత్తంచేశారు. పూర్తిగా నియమనిబంధనలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి, ఎక్కడాకూడా ఎటువంటి నిబంధనలు పాటించకుండా, చట్టవిరుద్ధంగా పోర్టులను కబ్జాచేశారు. వాటికి సంబంధించిన కథనాలు నేడుప్రముఖ దినపత్రికల్లో వచ్చాయి. ఆవార్తలు చూశాక నేనుకొన్ని అంశాలపై దృష్టి సారించి లోతుగా అన్వేషిస్తే, దొంగలముఠాకు సంబంధించిన దోపిడీవ్యవహారమంతా బయటపడింది. కాగితాలు, ఆధారా లు లేకుండా నేను మాట్లాడను.

బందిపోటు ముఖ్యమంత్రి దోపిడీని ఆధారాలతో సహా నిరూపించడానికే నేడు మీడియాముందుకొచ్చాను. సహజంగా ఏముఖ్యమంత్రైనా సరే, రాష్ట్రానికి సంపదఎలా సృష్టించాలని ఆలోచిస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్ర సంపదనంతా దోచుకొని, తనవ్యక్తిగత సంపదను పెంచుకునే పనిలోఉన్నాడు. జగన్ రెడ్డి పదవీకాలం పూర్తయ్యేసరికి రాష్ట్రానికి మిగిలేది పెద్దగుండుసున్నానే. జగన్ రెడ్డి ఖజానా మాత్రం తరతరాలకు సరిపోయేలా పూర్తిగా నిండుకుంటుంద నడంలో ఎటువంటిసందేహం లేదు. రాష్ట్ర సంపదలన్నీ ఒక్కొ క్కటిగా ఆవిరైతే, జగన్ రెడ్డి ఆస్తులు మాత్రం ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. మొన్ననే విశాఖపట్నంలోని విశాఖస్టీల్ ప్లాంట్ ను తెగనమ్మడానికి పోస్కోకంపెనీవారితో ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నాడో అందరం చూశాము. నేడు రాష్ట్రంలోని అతికీలకమైన పోర్టులను, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో కీలకమైన నౌకాశ్రయాలను (పోర్టులను) కూడా దిగమింగడా నికి సిద్ధమయ్యాడు. బందిపోటు ముఖ్యమంత్రి కాకినాడలోని రెండుపోర్టులతోపాటు, రామాయపట్నంపోర్టునుకూడా ఇదే అరబిందోకంపెనీద్వారా కబ్జాచేసేశాడు. రామాయపట్నం పోర్టు అరబిందో కంపెనీకే అప్పగించాడు. కాకినాడసీపోర్ట్ , కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ కూడా అరబిందో కంపెనీకే దక్కాయి. ఇదిఎలాసాధ్యమో బందిపోటు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. బందిపోటుముఠాలో సభ్యుడు, ముఖ్యమంత్రి బినామీ అయితేచాలా. నియమనిబంధనలు, చట్టాలు వర్తించవా? దిక్కుమాలిన జీవోలిచ్చి మొత్తంసంపదనంతా దోచుకుంటారా ? 10-03-2021న ఇచ్చిన జీవోనెం-3 చూస్తే, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ నుకబ్జా చేయడానికి ఇచ్చినట్లుగా అర్థమవుతోంది. కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ లో 99.74శాతం షేర్లను అరబిందో రియాలిటీ సంస్థకు బదలాయించామని, దానికోసం కొన్ని నిబంధనలు మారుస్తూ ఈజీవోనుఇచ్చారు. రాష్ట్రంలోని పోర్టుని ఒక కంపెనీ స్వాధీనంచేసుకుంటే, దానికి 75కిలోమీటర్ల దూరం లో ఉన్న మరేఇతర పోర్టుల్లోకూడా అదేకంపెనీకి 25శాతానికి మించి షేర్ ఉండటానికి వీల్లేదు.

పోర్టులన్నీ ఒకేకంపెనీ చేతుల్లోకి వెళ్లకూడదనే అటువంటి నిబంధన పెట్టారు. కానీ అతిసమీపంలో ఉన్న రెండుపోర్టులను ఒకకంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. కాకినాడ గేట్ వేపోర్ట్ లిమిటెడ్ తోపాటు, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ ను కూడా అరబిందో కంపెనీకి అప్పగించడానికి సిద్ధమయ్యారు. కాకినాడ సీపోర్ట్ లో అదే కంపెనీకి 41.12శాతం వాటాషేర్లు ఉన్నాకూడా, నిబంధనలు మార్చిమరీ, కాకినాడ గేట్ వేపోర్టు లిమిటెడ్ లో 99శాతం వాటాను అదేకంపెనీకి అప్పగించడానికి జీవోఇచ్చా రు. 24-12-2020న ఇదే ప్రభుత్వమిచ్చిన జీవోనెం-17లో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లోని41.12శాతం షేర్లను వేరే కంపెనీకి బదలాయిస్తున్నట్లు చెప్పారు. జీవోనెం-17 విడుద లకు ముందే, కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ కు సంబంధించి న షేర్లబదిలీ లావాదేవీలు అప్పటికే పూర్తయ్యాయి. ఏపీ మారిటైమ్ బోర్డ్ సీఈవో ఎన్.పీ.రామకృష్ణారెడ్డి 19-11-2020న ఫ్రభుత్వప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఒకలేఖ రాశారు. ఆలేఖలో కాకినాడఎస్ఈజెడ్ లోభాగంగా ఉన్న గేట్ వే పోర్టు లిమిటెడ్ లోనిషేర్ల బదలాయింపును ప్రస్తావించారు. దానికి ముందే జీఎమ్ఆర్ కంపెనీ నవంబర్ 11-2020న బీఎస్ఈ (బాంబే స్టాక్ఎక్స్ఛేంజ్) ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ఎక్సేంజ్)కి ఒక లేఖరాశారు. సదరు జీఎమ్ఆర్ కంపెనీ రాసిన లేఖలో కాకినాడ గేట్ వేపోర్ట్ లిమిటెడ్ లో జీఎమ్ఆర్ పేరుతో తమకున్నషేర్లన్నింటినీ అరబిందోరియాలిటీ సంస్థకు బదిలీచేస్తున్నట్లు రాశారు. దాదాపు రూ.2610కోట్లకు సంబంధించిన డీల్అది. దానికిసంబంధించి నవంబర్ 2020లోనే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు లేఖరాశారు. నవంబర్ 2020లోనే బీఎస్ఈకి, ఎన్ఎస్ఈకీ, జీఎమ్ఆర్ కంపెనీ షేర్ హోల్డర్లందరికీ షేర్లబదలాయింపు అరబిందోకంపెనీకి చేస్తున్నట్లు పూర్తిసమాచారం ఇచ్చేశారు. ఏపీ మారిటైమ్ బోర్డ్ సీఈవో రామకృష్ణారెడ్డేమో నవంబర్19, 2020న ప్రభుత్వానికి లేఖరాస్తారు. కాకినాడ గేట్ వేపోర్టు లిమిటెడ్ లోని 99శాతం షేర్లను బదలాయించే ప్రక్రియ నవంబర్ 2020లోనే జరిగితే, కాకినాడ సీపోర్ట్ లోఉన్న 41.12శాతం షేర్లను, తిరిగి అదేఅరబిందోకంపెనీకి బదలాయిస్తూ, డిసెంబర్ 24వతేదీన జీవోఎలా ఇచ్చారు? ఇది నిబంధనలు తుంగలో తొక్కడం కాదా?

నవంబర్ 2020లోనే జీఎమ్ ఆర్ కంపెనీషేర్లు అరబిందోకంపెనీకి బదిలీ అయ్యే ప్రక్రియ ప్రారంభ మై, బీఎస్ఈకి, ఎన్ఎస్ఈకి, ఏపీ మారిటైమ్ బోర్డుకి తెలిశా క, 75కిలోమీటర్ల పరిధిలోపలే ఉన్న కాకినాడ సీపోర్ట్ లిమిటె డ్ లోని 41శాతంషేర్లను బదలాయిస్తూ బందిపోటు ముఖ్యమంత్రి జీవోఎలా ఇచ్చాడో సమాధానంచెప్పాలి. ఇది దోపిడీకోసం జరిగిన వ్యవహారం కాదా? తానే నిబంధనలు పాటించినట్లు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పుకుంటూ మార్చి10వతేదీన జీవోచూపిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. దొంగలాగా ఆయనే గతంలో విడుదలచేసిన జీవోనెం-17సంగతేంటి? కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లోని 41శాతంషేర్లను ఏరకంగా అరబిందోకు బదలాయించారు. దానికిముందే, గేట్ వే పోర్ట్ లిమిటెడ్ లోని 99శాతంషేర్ల బదిలీ ప్రక్రియ జగన్ ప్రభుత్వానికి తెలిసే జరిగినప్పుడు, 75 కిలోమీటర్ల పరిధిలోని కాకినాడ సీపోర్ట్ లోని 41శాతం షేర్లు అరబిందోకు ఏరకంగా ఇచ్చాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇవన్నీ జగన్ దోపిడీకీ ఆధారాలు కావా? తన ఇస్టానుసారం ఒకదానితర్వాత ఒకటి పోర్టులన్నీ కబ్జా చేసిన ముఖ్యమంత్రి, చట్టాలుమార్చి రాష్ట్రభవిష్యత్ కోసం పనిచేస్తు న్నట్లు చెప్పుకుంటున్నాడు. ఆయన పనిచేస్తోంది రాష్ట్ర భ విష్యత్ కోసం కాదు. తనభవిష్యత్ కోసమే. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, తనవ్యక్తిగత సంపదకోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. జీవోనెం-17ఏదైతేఉందో, అది నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినట్లు అర్థమవుతోంది. గతంలో దేశాన్ని బ్రిటీష్ వారు ఆక్రమించినప్పుడు, ఈస్టిండియా కంపెనీవారు దేశంలో దోచుకున్న సంపదనంతా ఓడలద్వారా వారి దేశాలకు తరలించినట్లుగా, జగన్ రెడ్డి కూడా రాష్ట్రసంపదనంతా దోచుకొని దాన్నిఇతరదేశాలకు తరలించడానికే ఇప్పుడుపోర్టులన్నింటీని కబ్జా చేస్తున్నాడు. రాష్ట్రంలోని ఖనిజసంపదతో పాటు, పోర్టులన్నీ తనచేతుల్లో ఉంటే, మరింత సంపదను కూడా తరలించవచ్చునని అను కుంటున్నాడు. మంత్రులు బాలినేని నల్లడబ్బుని రాష్ట్ర సరిహద్దులుదాటించి, చెన్నైనుంచి ఇతరదేశాలకు తరలించే ప్రయత్నంచేస్తే, నేడు అటువంటి ఇబ్బందిలేకుండా కబ్జాచేసి నపోర్టులద్వారా కంటైనర్లకొద్దీ నల్లడబ్బుని రాష్ట్రసరిహద్దులు దాటించే అవసరంలేకుండా, దర్జాగా పోర్టులద్వారా ఇతరదేశా లకు తరలించేందుకు బందిపోటు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.

రాష్ట్రానికి సంపదసృష్టించే ప్రయత్నాలను చంద్రబాబునాయుడు చేస్తే, దాన్ని తనవ్యక్తిగత సంపదగా మార్చుకొ ని ఇతరదేశాలకు తరలించే ప్రయత్నాలను జగన్ రెడ్డి చేస్తున్నాడు. తనబినామీ అయిన అరబిందో కంపెనీని అడ్డుపెట్టుకొని , రామాయపట్నం పోర్టు సహా, కాకినాడలోని రెండుపోర్టులను ఎలా దోచిపెడుతున్నాడో అర్థమైంది కదా. రాష్ట్రంలోని కీలకమైన పోర్టులన్నీ జగన్ బినామీకంపెనీ చేతుల్లోకి వెళితే, సంపదనంతా తరలించొచ్చు, వ్యవస్థలను తనగుప్పెట్లో పెట్టుకొని, భవిష్యత్ లో రాష్ట్ర సంపదమొత్తం తనకబంధహాస్తాల్లో పెట్టుకోవచ్చన్నకుట్రలో జగన్ రెడ్డి ఉన్నాడు. డిసెంబర్ 24 న కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లోని 41శాతంషేర్లను ఏరకంగా అరబిందో కంపెనీకి బదలాయిం చారు? దానికిముందే నవంబర్ నెలలో కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ కుచెందిన 99శాతంషేర్లను జీఎమ్ఆర్ కంపెనీనుంచి అరబిందోకంపెనీకి బదలాయించే ప్రక్రియ ప్రారంభమయ్యాక, చట్టవిరుద్ధంగా 75 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న కాకినాడ సీపోర్ట్ లోని 41శాతం షేర్లను ఏరకంగా బదిలీచేశారో సమాధానం చెప్పాలి. తప్పుడుజీవోలను తక్షణమే రద్దుచేయాలి. అలాచేయకుంటే న్యాయపోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాము. మీరుచేసే తప్పుడు పనులకు రిటైర్డ్ జస్టిస్ అభిప్రాయాలు తీసుకున్నాము...అంతా సక్రమంగా చేశామంటే కుదరదు. ముఖ్యమంత్రి పిట్టకథలు చెప్పడం మానేసి, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో లేఖరాశాకకూడా కాకినాడ సీపోర్ట్ లోని 41శాత షేర్లను బదలాయించారో చెప్పాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా , మినిస్ట్రీ ఆఫ్ కామర్స్అండ్ ఇండస్ట్రీ డిపార్ట్ మెంట్ వారు డిసెంబర్ 7, 2020న కాకినాడ ఎస్ఈజెడ్ లోని షేర్ల బదలాయింపునకు ఆమోదంఇస్తే, దాన్నికూడాదాచేసి, 75 కిలోమీటర్ల పరిధిలోఉన్న కాకినాడసీపోర్ట్ షేర్లను బదలాయిం చడం నిబంధనలకు విరుద్ధమో కాదో ముఖ్యమంత్రి చెప్పాలి. ఈవిధంగా అన్నిరకాల నిబంధనలను తుంగలోతొక్కి, బంది పోటుముఖ్యమంత్రి రాష్ట్రానికి చెందినసంపదనంతా దోచుకు తింటున్నాడని ప్రజలంతా అర్థంచేసుకోవాలని కోరుతున్నా ఈవ్యవహారంపై బందిపోటు ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుంటే, దాన్నిఅడ్డుకొని తీరుతాము. రాష్ట్రసంపద జగన్ చేతుల్లో పడకుండా కాపాడటమే టీడీపీ లక్ష్యం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read