నలంద కిషోర్. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి మద్దతు తెలుపుతున్న వ్యక్తే కాకుండా, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కు సన్నిహితుడు కూడా. గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర ఉన్న ఇసుకపల్లి గ్రామానికి చెందిన కిషోర్, 40 ఏళ్ళ క్రిందట, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేసేందుకు విశాఖ వచ్చారు. ఎమ్మెస్సీ చేసిన ఆయన, కొంత కాలం లెక్చరర్ గా కూడా పని చేసారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత, నలంద విద్యా సంస్థలకు డైరెక్టర్ గా పని చేసారు. ఉత్తరాంధ్రలో ఆయన నలంద బాధ్యతలు తీసుకోవటంతో, క్రమంగా ఆయన పేరు నలంద కిషోర్ గా మారింది. ఈ క్రమంలోనే, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పని చెయ్యటం, తరువాత గంటాకు దగ్గర కావటంతో, గత రెండు దశాబ్దాలుగా, గంటాకు తెర వెనుక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు అనే పేరు ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అడుగు పెట్టారు. అయితే పాయిన నెల, ఒక వాట్స్ అప్ మెసేజ్ షేర్ చెయ్యటం, అందులో ఎవరి పేర్లు లేకపోయినా, అది తమ గురించే అనుకుని, కొంత మంది పెద్దలు, నలంద కిషోర్ పై సిఐడి కేసు పెట్టి, వేధించారు.
విశాఖ నుంచి కర్నూల్ కు తీసుకువచ్చి, కరోనా పేషెంట్లు ఉన్న చోట, ఎక్కువ సేపు కూర్చోపెట్టారు అనేది ఆరోపణ. ఆయన గత రెండు మూడు రోజులుగా అస్వస్తతకు గురయ్యి చనిపోయారు. ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు వల్లే, ఆయన మనో వేదనకు గురయ్యారని, అలాగే కరోనా సోకేలా చేసారని, ఏకంగా, వైసీపీ ఎంపీ స్పందించిన తీరు, చర్చనీయంసం అయ్యింది. అయితే దీని పై స్పందించిన మంత్రి అవంతి, ఫైర్ అయ్యారు. చావులకు కూడా ఇలా చెయ్యటం హేయం అంటూ స్పందించారు. రఘురామ రాజుకి నోటి దురద ఎక్కువని అన్నారు. కరోనా ఎవరికైనా వస్తుందని, కర్నూల్ తీసుకు వెళ్ళటం వల్లే వచ్చిందని చెప్పటం హేయం అని అన్నారు. నలంద కిషోర్ తెలుగుదేశం కార్యకర్త అని, మేము కూడా ఆయన మరణానికి చింతిస్తున్నాం అని అన్నారు. చంద్రబాబుకు, లోకేష్ కు అంత ప్రేమ నలంద కిషోర్ పై ఉంటే, వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించలేదని వింతగా ప్రశ్నించారు. మొత్తానికి మంత్రి మాటలతో, ఈ వివాదం కూడా రాజకీయ టర్న్ తీసుకుంది.