కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రాన్ని ఈ ముడున్నర ఏళ్ళలో ఎలా చిన్న చూపు చూసిందో అందరికీ తెలిసిందే... అయితే కీలకమైన అమరావతి, పోలవరం, మిగతా ప్రాజెక్ట్ ల కోసం, చంద్రబాబు ఓర్పుతో కేంద్రంతో నెట్టుకు వస్తున్నారు... అయితే, ప్రజల్లో మాత్రం బీజేపీ మీద చాలా వ్యతిరేకత ఉంది... అదే విషయం ఇవాళ ఉండవల్లిలో జరిగిన టీడీపీ వర్క్‌షాప్ లో, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గెట్టిగా వినిపించారు... చంద్రబాబు ఉండగా, ఈ విషయం పై ఆవేశపూరిత ప్రసంగం చేసారు... కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ఉతికి ఆరేసారు.. అక్కడ ఉన్న మిగతా వారి రియాక్షన్ చుస్తే, మూడ్ అఫ్ ది స్టేట్ అర్ధమవుతుంది...
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడుతూ "మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. 5 కోట్ల మందికి ప్రతినిధిని అన్న విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి... మీరు ఢిల్లీకి 42 సార్లు వెళ్లారు... విభజన హామీల్లో ఒక్కటి కూడా అమలుకవవటం లేదు... కేంద్రం ప్రత్యేక హోదా బదులు, ప్రత్యేక ప్యాకేజి అంది.. అయినా ఒప్పుకున్నాం.. ఇంత వరకు ప్రత్యేక ప్యాకేజి హామీలు కూడా అమలు కాలేదు... రైల్వే జోన్ కూడా అమలు కాలేదు... మీకు సముద్రం అంత సహనం ఉంది... కాని ప్రజలకు అంత సహనం ఉండదు... వారు అన్నీ గమినిస్తూ ఉంటారు... "
"అవసరమైనప్పుడు తీర్పు చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణా ప్రజలు లాగ, ప్రతి దానికి ఆందోళన చెంది రోడ్డు ఎక్కరు.... సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయంతో, సరైన విధంగా నిర్ణయం తీసుకుంటారు..." అంటూ ఆవేశంగా ప్రసంగించారు... ఎంపీ అవంతి వ్యాఖ్యలకు అక్కడ ఉన్న ఎంపీలు, ఎమ్మల్యేలు అందరూ చప్పట్లు కొట్టి మద్దతు పలికారు... దీంతో చంద్రబాబు అవంతి వ్యాఖ్యల పై స్పందించారు... నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా, చివరి వరకు ప్రయత్నిస్తా.. నా చేతిలో రాష్ట్ర భవిష్యత్తు ఉంది... మిగతా వారిలా నేను కూడా ఆవేశపడి తిరగబడితే, ప్రజలు కూడా అసహనానికి గురి అవుతారు... ఆందోళనలతో రాష్ట్రం వెనుకబడి పోతుంది... చివరి వరకు చూద్దాం... కాకపొతే దండం పెడదామని చంద్రబాబు అన్నారు... రెండు రోజులగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, చంద్రబాబు కూడా కేంద్రం పై అసహనంగా ఉన్నా, రాష్ట్రం కోసం భరిస్తున్నారు అని అర్ధమవుతుంది...